ఎమ్మెల్యే టికెట్‌ నిరాకరణ: కాంగ్రెస్ అసమ్మతి వాదులు ఆగ్రహం.. పోస్ట‌ర్లు చింపుతూ..

Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల మొద‌టి జాబితాను ఆదివారం విడుద‌ల చేసింది. అయితే, ప‌లువురు సీనియ‌ర్ల‌కు ఎమ్మెల్యే టికెట్‌ నిరాక‌రించ‌డంతో కాంగ్రెస్‌ కార్యాలయం ధ్వంసం, పోస్టర్లు చింపుతూ అసమ్మతి వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జహీరాబాద్ (ఎస్సీ) నుంచి మాజీ మంత్రులు డాక్టర్ జె గీతారెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి నాగం జనార్దన్ రెడ్డి సహా సీనియర్ నేతలకు కూడా కాంగ్రెస్ టిక్కెట్లు నిరాకరించింది.
 

Denial of MLA ticket: Congress dissidents angry Tearing up the posters, Telangana Assembly Elections 2023 RMA

Telangana Assembly Elections 2023: తెలంగాణ కాంగ్రెస్ వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల మొద‌టి జాబితాను ఆదివారం విడుద‌ల చేసింది. అయితే, ప‌లువురు సీనియ‌ర్ల‌కు ఎమ్మెల్యే టికెట్‌ నిరాక‌రించ‌డంతో కాంగ్రెస్‌ కార్యాలయం ధ్వంసం, పోస్టర్లు చింపుతూ అసమ్మతి వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జహీరాబాద్ (ఎస్సీ) నుంచి మాజీ మంత్రులు డాక్టర్ జె గీతారెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి నాగం జనార్దన్ రెడ్డి సహా సీనియర్ నేతలకు కూడా కాంగ్రెస్ టిక్కెట్లు నిరాకరించింది.

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 55 మంది అభ్యర్థులతో తెలంగాణ కాంగ్రెస్ ఆదివారం తొలి జాబితాను ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే అసమ్మతివాదులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా నిన‌దిస్తున్నారు. కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావును పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేయడంతో చింతలపల్లి జగదీశ్వర్ రావు అనుచరులు ఫ్లెక్సీలు, కటౌట్లు, పార్టీ జెండాలను దగ్ధం చేశారు. రెండు నెలల క్రితం జూపల్లి బీఆర్ఎస్ నుంచి వలస వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారని జగదీశ్వర్ రావు అనుచరులు ఆరోపించారు. ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన జగదీశ్వర్ కు కాకుండా కొత్తవారికి సీటు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే, ఉప్పల్ లో కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మండుముల పరమేశ్వర్ రెడ్డిని నామినేట్ చేయడంతో రాగిడి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఉప్పల్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం పరమేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి తీవ్రంగా పోటీ పడుతుండటంతో పాటు తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయి. పార్టీ కోసం ఎంతో కాలంగా ప‌నిఏస్తుంటే త‌న‌ను ఇలా ప‌క్క‌న పెట్ట‌డంతో పార్టీకి రాజీనామా చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. జహీరాబాద్ (ఎస్సీ) నుంచి మాజీ మంత్రులు డాక్టర్ జె.గీతారెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి నాగం జనార్దన్ రెడ్డి సహా సీనియర్ నేతలకు కాంగ్రెస్ టికెట్లు నిరాకరించింది.

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో ఉంచ‌డానికి త‌న‌కు టికెట్ కేటాయించ‌క‌పోవ‌డంపై సీనియ‌ర్ లీడ‌ర్ నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయ‌న త్వ‌ర‌లోనే కీల‌క నిర్ణ‌యం తీసుకుంటార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్‌లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారనీ, తన అభిమానులు, ప్ర‌జ‌ల‌ కోరిక మేరకు స‌రైన‌ నిర్ణయం తీసుకుంటానని ఆయ‌న పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ను నాగం జనార్ధన్ రెడ్డి ఆశించారు. అయితే, ఆ టికెట్ ఆయ‌న‌కు కాకుండా డాక్ట‌ర్ కూచ‌కుల్ల రాజేశ్ రెడ్డికి కేటాయించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios