ఇంటి నెంబర్ కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారులు
ఇంటి నెంబర్ కోసం మున్సిపాలిటీ అధికారులు లంచం (Bribe) డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు బాధితుడు ఆ మున్సిపాలిటీ అధికారులకు లంచం ఇవ్వబోయాడు. ఈ సమయంలో ఏసీబీ రైడ్ చేసి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో (Nirmal Municipality officials caught red-handed by ACB officials while accepting bribe) జరిగింది.
నిబంధనలు పాటిస్తూ ప్రజలకు సేవలందించాల్సిన ప్రభుత్వ అధికారుల్లో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని లంచాలు డిమాండ్ చేస్తున్నారు. అయితే బాధితులు ఏసీబీని ఆశ్రయించడం వల్ల ఇలాంటి ఘటనలు కొన్ని బయటకు వస్తున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
అయోధ్య రామ్ లల్లా విగ్రహానికి కొత్త పేరు.. ఇక నుంచి ఆ పేరుతోనే దర్శనం
వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ మున్సిపాలిటీలోని ఏఎన్ రెడ్డి కాలనీకి చెందిన వెలుమ గోపాల్ రెడ్డి ఇంటి నెంబర్ పొందాలని భావించారు. దాని కోసం మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తులను పరిశీలించి ఇంటి నెంబర్ ఇవ్వాల్సిన అధికారులు లంచం డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారి (ఆర్ వో) టి. గంగాధర్, బిల్ కలెక్టర్ టి.నవంత్ లు రూ.3,500 లంచం ఇవ్వాలని గోపాల్ రెడ్డిని అడిగారు.
184 మంది మయన్మార్ సైనికులను స్వదేశానికి పంపిన ఇండియా.. ఎందుకంటే ?
దీంతో బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశారు. ఆ అధికారుల సూచన మేరకు గంగాధర్ లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రూ.3,500 తీసుకొని ఆర్ వో, బిల్ కలెక్టర్ కు ఇచ్చారు. అయితే అదే సమయంలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెలుమ గోపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ ఆదిలాబాద్ యూనిట్ ఆ మున్సిపాలిటీ అధికారులను అరెస్టు చేసింది.