Asianet News TeluguAsianet News Telugu

కాలేయ మార్పిడికి రూ.కోటి ఖర్చు: కార్పోరేట్ ఆసుపత్రిపై ప్రధానికి ఫిర్యాదు

లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకొన్న రోగి మృతి

Delhi woman complained against Hyderabad corporate hospital to prime minister


హైదరాబాద్: కాలేయ మార్పిడి కోసం ఓ కుటుంబం హైద్రాబాద్, ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో  కోటి రూపాయాలను ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. ఈ విషయమై తాను ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసినట్టుగా బాధిత కుటుంబం సోషల్ మీడియాలో ప్రకటించింది.  అయితే హైద్రాబాద్ నగరంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో బాధిత కుటుంబం లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసిన విషయం చేసుకొన్నట్టు ఆమె చెబుతోంది. అయితే తాము వద్దన్న వినకుండా ఆసుపత్రి నుండి బాధిత కుటుంబం వెళ్ళిపోయిందని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.

ఢిల్లీకి చెందిన పారూల్ బీషాన్ వర్మ  తల్లికి హైద్రాబాద్ లోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకొంది. అంతకుముందే దేశంలోని ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ ట్రీట్ మెంట్ తీసుకొన్నట్టు బాధిత కుటుంబం చెబుతోంది. ఈ విషయమై ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఢిల్లీలోని బీఎల్ కపూర్ ఆసుపత్రిలో చికిత్స చేసినట్టు ఆ కథనం వెల్లడించింది. ఆ తర్వాత హైద్రాబాద్ లోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ పూర్తి చేసుకొన్నారు. ఈ ఆపరేషన్ కోసం రూ. 27 లక్షలు ఖర్చు చేశారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తి చేసిన తర్వాత  ఈ ఏడాది మే 7వతేదిన బాధితురాలు మృతి చెందింది.

అంతేకాదు ప్రతి రోజూ కనీసం లక్ష రూపాయాలను ఖర్చు చేసినట్టుగా కూడ చెబుతున్నారు. అయితే ఇంకా కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని ఆసుపత్రి వైద్యులు సూచించినా పట్టించుకోకుండా రోగిని తీసుకెళ్ళి వారు ఢిల్లీకి వెళ్ళిపోయారని ఆసుపత్రి యాజమాన్యం చెబుతున్నట్టు ఆ చానెల్ కథనాన్ని ప్రసారం చేసింది.

బాధిత కుటుంబం తమను సంప్రదించలేదని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది. అయితే బాధిత కుటుంబానికి చెందిన యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివరాలు కూడ తమ దృష్టికి వచ్చినట్టుగా వాళ్ళు చెబుతున్నారు. కానీ, ఈ విషయంలో తమ తప్పేమీ లేదని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.

తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబానికి చెందిన యువతి ఫేస్ బుక్ లో తన ఆవేదనను పోస్ట్ చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రికి కూడ ఫిర్యాదు చేసినట్టుగా  బాధిత యువతి ప్రకటించింది. ఇతర ఆసుపత్రుల కంటే తాము తక్కువ బిల్లే వసూలు చేసినట్టుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

సుమారు కోటి రూపాయాలు ఖర్చు చేసినా తమ తల్లి బతకలేదని  పారూల్ బిషిన్ వర్మ  సోషల్ మీడియాలో  ప్రకటించింది. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios