హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంధ్య కన్వెక్షన్ ఎండీ శ్రీధర్ రావును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సంధ్య కన్వెక్షన్ ఎండీ శ్రీధర్ రావును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేసిన కేసులో పోలీసులు శ్రీధర్ రావును అరెస్ట్ చేశారు. శ్రీధర్ రావు అమితాబ్ బచ్చన్ బంధువు నుంచి రూ. 250 కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అతడు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. శ్రీధర్ రావు కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో శ్రీధర్‌ రావును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

అయితే ఈ పరిణామాలపై స్పందించిన శ్రీధర్ రావు.. తాను అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేశానని అనడం అవాస్తమమని చెప్పారు. తానే రూ. 180 కోట్లు చెల్లించానని తెలిపారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించి న్యాయ పోరాటం చేయనున్నట్టుగా చెప్పారు. 

ఇక, శ్రీధర్ రావు గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడిగాఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తో పాటు ముంబైలోని పలువురు బిల్డర్స్‌ను మోసం చేసినట్టుగా శ్రీధర్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా శ్రీధర్ రావు మీద అసహజ లైంగిక దాడి కేసు కూడా గతంలో నమోదైంది. శ్రీధర్ రావు తనపై అత్యంత క్రూరంగా లైంగిక దాడికి పాల్పడినట్టు ఆయన జిమ్ ట్రైనర్ చేశారు. ఈ మేరకు సనత్ నగర్ పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

ఇక, గతేడాది గచ్చిబౌలిలో ఓ ఈవెంట్ మేనేజర్‌పై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్టుగా శ్రీధర్ రావుపై ఆరోపణలు వచ్చాయి. అయితే కొన్ని కేసుల్లో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా.. ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.