ఢిల్లీ లిక్కర్ స్కాం: ఢిల్లీకి బయలుదేరిన కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారంనాడు ఢిల్లీకి బయలుదేరారు. రేపు విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో కవిత ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారంనాడు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కల్వకుంట్ల కవితతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. రేపు విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఈడీ విచారణకు కవిత హాజరౌతారా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్రపిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబులతో కలిపి కవితను విచారించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది
ఈ క్రమంలోనే అరుణ్ రామచంద్రపిళ్లై ఈడీ కస్టడీని ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. కోర్టు కూడా అంగీకరించింది. మరోవైపు కవితకు గతంలో ఆడిటర్ గా పనిచేసిన బుచ్చిబాబును కూడ ఈడీ అధికారులు రెండు రోజుల క్రితం విచారించారు. బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రపిళ్లైలతో కలిపి కవితను విచారించే అవకాశం లేకపోలేదు.
అయితే రేపు విచారణకు కవిత హాజరౌతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 6వ తేదీన అరుణ్ రామచంద్రపిళ్లైని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరుణ్ రామచంద్రపిళ్లై ఈడీ అధికారులకు కీలక స్టేట్ మెంట్ ఇచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాను కవిత ప్రతినిధిగా వ్యవహరించినట్టుగా అరుణ్ రామచంద్రపిళ్లై ఈడీ అధికారులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే ఈ స్టేట్ మెంట్ ను అరుణ్ రామచంద్రపిళ్లై వెనక్కి తీసుకుంటున్నట్టుగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అనుమానితురాలు అంటూ ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. అరుణ్ రామచంద్రపిళ్లై కస్టడీ పొడిగింపు సమయంలో ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు ఈ విషయం చెప్పారు.
also read:నేడు ఢిల్లీకి కల్వకుంట్ల కవిత: రేపు ఈడీ విచారణకు హాజరుపై ఉత్కంఠ
ఈ నెల 11న ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు.ఈ నెల 16న ఈడీ విచారణకు కవిత మాత్రం హాజరు కాలేదు. ఈ నెల 16న తన తరపున బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి సోమా భరత్ ను ఈడీ కార్యాలయానికి పంపారు కవిత. ఈడీ విచారణపై తాను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినందున ఈ నెల 24వ తేదీ వరకు విచారణకు రాలేనని కవిత ఈడీకి లేఖ పంపారు. కానీ ఈ నెల 20న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపారు.