ఢిల్లీ లిక్కర్ స్కాం: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు

టీఆర్ఎస్  ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ, హైద్రాబాద్ లలో  ఎక్కడైనా  విచారణకు రావొచ్చని పేర్కొంది.

 Delhi Liquor Scam:CBI Issues Notice to  TRS  MLC  Kavitha

హైదరాబాద్: టీఆర్ఎస్  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కాంలో 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6వ తేదీన 11 గంటలకు వివరణ ఇచ్చేందుకు రావాలని సీబీఐ అధికారులు నోటీసులో  పేర్కొన్నారు.

 Delhi Liquor Scam:CBI Issues Notice to  TRS  MLC  Kavitha

ఈ కేసులో ఇటీవలనే అరెస్టైన  ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా  సన్నిహితుడు  అమిత్ ఆరోరాను  ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు. అమిత్ ఆరోరా  రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. ఈ తరుణంలోనే ఎమ్మెల్సీ కవితకు  సీబీఐ నోటీసులు జారీ చేయడం చర్చకు దారి తీసింది. సీబీఐ నోటీసులపై కవిత స్పందించారు. ఈ నెల 6వ తేదీన  తన ఇంటి వద్దే సీబీఐకి  వివరణ ఇవ్వనున్నట్టుగా కవిత తేల్చి చెప్పారు. తన ఇంటి వద్దే సీబీఐ అధికారులను కలుస్తానని  సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 6వ తేదీన  ఢిల్లీ లేదా హైద్రాబాద్ లలో  ఏదో ఒక చోట  వివరణ ఇవ్వాలని సీబీఐ కోరింది.  దీంతో  కవిత హైద్రాబాద్ లో  వివరణ ఇవ్వనున్నట్టుగా  కవిత  సీబీఐ అధికారులకు సమాచారం పంపింది. 

ALSO READ:ఢిల్లీ లిక్కర్‌స్కాం: అమిత్ ఆరోరాను అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఆరుగురిని  ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు.వ్యాపారవేత్త  అమిత్ ఆరోరా అరెస్ట్  తో  సీబీఐ, ఈడీ ఈ  కేసులో మరింత దూకుడును పెంచాయి.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సీబీఐ కేసును నమోదు చేసింది.ఈ కేసులో హైద్రాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై పేరును చేర్చింది.ఈ కేసులో సీబీఐ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ కూడా రంగంలోకి దిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణలోని హైద్రాబాద్, కరీంనగర్, ఏపీలోని నెల్లూరు తదితర జిల్లాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

తెలుగు రాష్ట్రాలకు చెందిన బోయినపల్లి అభిషేక్ రావు , శరత్ చంద్రారెడ్డి లను ఈడీ అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే.  ఈ కేసులో  ఢిల్లీ డిప్యూటీ సీఎం  దినేస్ ఆరోరా సీబీఐకి అఫ్రూవర్ గా మారిన విషయం తెలిసిందే.ఈ ఏడాది సెప్టెంబర్ 27న సమీర్ మహేంద్రును ఈడీ అరెస్ట్  చేసింది. విచారణకు సహకరించడం లేదనే నెపంంతోనే సమీర్ మహేంద్రు, అమిత్ ఆరోరా,  శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు, అభిషేక్ రావు బోయినపల్లిలను దర్యాప్తు సంస్థల అధికారులు అరెస్ట్  చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios