నల్గొండలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతికి సర్జరీ: పోలీసుల అదుపులో రోహిత్
నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతికి మంగళవారం నాడు రాత్రి వైద్యులు సర్జరీ చేశారు. బాధిత యువతి ఆరోగ్య పరిస్థితిపై ఇవాళ వైద్యులు బులెటిన్ ను విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రేమోన్మాది రోహిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు
నల్గొండ: ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతికి మంగళవారం నాడు రాత్రి వైద్యులు సర్జరీ చేశారు. యువతి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇవాళ బులెటిన్ ను విడుదల చేసే అవకాశం ఉంది.
Nalgonda జిల్లా కేంద్రంలోని పానగల్ పట్టణానికి చెందిన యువతి బీబీఏ పూర్తి చేసింది. అయితే BBA రెండో సంవత్సరం చదువుతున్న Rohith అనే యువకుడు ఆ యువతిని ప్రేమిస్తున్నట్టుగా చెప్పడంతో ఆమె దూరం పెట్టినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ ప్రచారంపై యువతి కుటుంబ సభ్యులు మాత్రం ఖండిస్తున్నారు. రోహిత్ అనే యువకుడు తమ కూతురితో ప్రేమ వ్యవహరం సాగిస్తున్న విషయం తమకు తెలియదన్నారు.
మంగళవారం నాడు మధ్యాహ్నం నల్గొండలోని నల్గొండలోని ఫారెస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద ఉన్న పార్క్ వద్దకు పిలిపించి నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలితో పర్సనల్ గా మాట్లాడాలని చెబితే ఆమె స్నేహితులు పక్కకు వెళ్లిన సమయంలో అదను చూసి నిందితుడు దాడికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. పార్క్ వద్ద రోహిత్ ను చూడగానే ఇంటికి వెళ్దామని బాధితురాలు తన స్నేహితులను కోరింది యువతితో మాట్లాడుతానని కొద్దిసేపు ఉండాలని కోరడంతో చేసేదిలేక యువతి అక్కడే ఉండిపోయింది.ఈ సమయంలోనే యువతితో రోహితి గొడవకు దిగాడు. ఈ సందర్భంలోనే తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడి చేశాడని పోలీసులు తెలిపారు ఈ ఘటనతో షాక్ కు గురైన స్నేహితులు వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి శరీరంపై సుమారు ఎనిమిది చోట్ల గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. రోహిత్ కత్తితో చేసిన దాడిలో యువతి పేగులకు కూడా గాయాలయ్యాయి.దీంతో వైద్యులు మంగళవారం నాడు రాత్రి సర్జరీ చేశారు. యువతి శరీరంపై అయిన గాయాలకు వైద్యులు కుట్లు వేఃశారు. బాధిత యువతి ఆరోగ్య పరిస్థితిపై ఇవాళ వైద్యులు బులెటిన్ ను విడుదల చేసే అవకాశం ఉంది.
యువతిపై దాడికి దిగిన నిందితుడు రోహిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిపై ఎందుుకు దాడి చేయాల్సి వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నారు. బాధిత యువతితో రోహిత్ ఎంత కాలంగా పరిచయం ఉందనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సర్ ప్రైజ్ అంటూ బాధిత యువతిపై రోహిత్ దాడికి దిగినట్టుగా సమాచారం.
also read:నల్గొండలో దారుణం.. ప్రేమను కాదన్నదని, యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
తమ కూతురిపై దాడికి దిగిన రోహిత్ ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి పేరేంట్స్ కోరుతున్నారు. యువతి పొట్ట, ముఖం, చేయితో పాటు పలు చోట్ల గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.తెలుగు రాష్ట్రాల్లో గతంలో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకొన్నాయి. ప్రేమ పేరుతో యువతులపై దాడులకు పాల్పడిన ఘటనలపై నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కొన్ని ఘటనల్లో కోర్టులు నిందితులకు శిక్షలు కూడా వేశాయి. కోర్టులు శిక్షలు వేసినా కూడా ఈ తరహా ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిందితులకు వెంటనే శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.