హైదరాబాద్: రెండు రోజుల క్రితం కిడ్నాపైన వివాహిత దీపిక క్షేమంగా ఉన్నట్టుగా  పోలీసులు తెలిపారు. మంగళవారం నాడు ఉదయం దీపిక వికారాబాద్ పోలీసులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయాన్ని పోలీస్ అధికారులు ధృవీకరించారు.

ఈ నెల 27వ తేదీన  దీపిక వికారాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ కు గురైంది. దీపిక కిడ్నాప్ కు గురైన కారు ఆమె భర్త అఖిల్ కారుగా పోలీసులు గుర్తించారు.2016లో దీపిక, అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు.

 పెళ్లైన తర్వాత దీపిక నెల రోజులకే విడిపోయారు. దీంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. శనివారం నాడు విడాకుల కేసు విషయమై కోర్టుకు హాజరైన మరునాడు  దీపిక కిడ్నాప్ కు గురైందని దీపిక కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.

also read:రెండు రోజులైనా దొరకని వివాహిత దీపిక ఆచూకీ

దీపిక, అఖిల్ లు కలిసి ఉన్నట్టుగా తమకు సమాచారం అందిందని ఎస్పీ ప్రకటించారు. వీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నారని కూడ తమకు తెలిసిందని ఆయన చెప్పారు. ఇవాళ సాయంత్రం వరకు దీపిక, అఖిల్ ను వికారాబాద్ కు తీసుకొస్తామని ఎస్పీ చెప్పారు.

భర్త అఖిల్ తో ఇష్టపూర్వకంగానే వెళ్లినట్టుగా దీపిక పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం.