తెలంగాణలో మద్యం టెండర్ల దాఖలకు ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది.  ఈ నెల 21న మద్యం టెండర్లకు డ్రా నిర్వహించనున్నారు.

తెలంగాణలో మద్యం టెండర్ల దాఖలకు ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది. చివరి రోజు కావడంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు టెండర్లు వచ్చాయి. టెండర్ దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరింది. శంషాబాద్, సరూర్ నగర్‌లో అత్యధిక టెండర్లు దాఖలయ్యాయి. నిర్మల్‌లో అత్యల్పంగా టెండర్లు వచ్చినట్లుగా సమాచారం. ఈ నెల 21న మద్యం టెండర్లకు డ్రా నిర్వహించనున్నారు. అయితే ఎక్సైజ్ అధికారులు అంచనా వేసిన దానికంటే ఎక్కువగా దరఖాస్తులు రావడంతో ప్రభుత్వ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. 

కాగా.. తెలంగాణలోని మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యూవల్ కు  భారీగా  రెస్పాన్స్ వచ్చింది.  నిన్నటివరకు 42 వేల ధరఖాస్తులు అందాయి.  ఈ నెల  4వ తేదీ నుండి  18వ తేదీ వరకు  మద్యం దుకాణాల  లైసెన్సుల కోసం  ధరఖాస్తులను  తెలంగాణ ఎక్సైజ్ శాఖ స్వీకరిస్తుంది. 2021-23  లో రాష్ట్రంలోని  2,620  మద్యం దుకాణాలకు   37,500 ధరఖాస్తులు అందాయి.   ధరఖాస్తుల విక్రయం వల్లే  గతంలో  రూ. 750  కోట్ల ఆదాయం  ప్రభుత్వానికి అందింది.  అయితే  ఈ ఏడాది ఇప్పటి వరకు   ధరఖాస్తుల విక్రయం ద్వారా రూ. 840 కోట్ల ఆదాయం దక్కింది.   ఇంకా చివరి రెండు రోజులు ధరఖాస్తు చేసుకొనేందుకు  అవకాశం ఉంది. దీంతో  ఈ రెండు రోజుల్లో  భారీగా ధరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖాధికారులు విడుదల చేయనున్నారు. నిన్న రోజే  8,500 ధరఖాస్తులు వచ్చాయి.

20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో  మద్యం దుకాణం లైసెన్సు కోసం  రూ. 1.10 కోట్లను నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధితో పాటు ఉమ్మడి రంగారెడ్డి  జిల్లాలోని కొన్ని మద్యం దుకాణాలకు  భారీగా టెండర్లు  దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు 20 కంటే ధరఖాస్తులు అందితే  ఆ మద్యం దుకాణానికి మళ్లీ టెండర్లను  పిలవాలని  అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  మద్యం దుకాణాలు దక్కించుకున్నవారికి భారీగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగానే  ప్రధానమైన  సెంటర్లలోని  మద్యం దుకాణాలకు  పోటీ పడి ధరఖాస్తులు చేసుకొనే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.