గల్లంతైన పూజారి మృతదేహం లభ్యం.. చేతుల్లోనే అమ్మవారి విగ్రహం...
రెండు రోజుల క్రితం జగిత్యాల ఎన్ఆర్ఎస్పీ కెనాల్ లో గల్లంతైన పూజారి మృతదేహం లభ్యమయ్యింది. చేతిలో అమ్మవారి విగ్రహం అలాగే ఉండడం ఆశ్యర్యానికి గురిచేసింది.
జగిత్యాల : ఈ సారి దసరా అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నా.. భారీ వర్షాలు, వరదల కారణంగా పిడుగుపాటుకు, నీటిలో మునిగి పలువురు మృతి చెందారు. జగిత్యాలలోనూ ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. జగిత్యాల ఎన్ఆర్ఎస్పీ కెనాల్ లో ఓ పూజారి గల్లంతయ్యాడు. అర్చకుడి మృతదేహం లభ్యమయ్యింది. రెండు రోజుల క్రితం దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఆయన గల్లంతయ్యారు. ఇత్తడి విగ్రహాన్ని కడిగేందుకు ఎన్ఆర్ఎస్పీ కెనాల్ లో పూజారి దిగారు.
రేవల్లే ఎస్సారెస్పీ కెనాల్ లో అర్చకుని మృతదేహం లభించింది. చనిపోయినా.. అమ్మవారి విగ్రహం పూజారి చేతిలోనే ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలా ఉండగా, రంగారెడ్డి జిల్లాలో దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని శ్రీకాంత్ గా గుర్తించారు. వివరాలు.. దుర్గాదేవి నిమజ్జనం కోసం హిమాయత్ సాగర్ చెరువు వద్దరు వెళ్లిన సమయంలో శ్రీకాంత్ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మరో రెండు రోజుల పాటు వర్షాలు: పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ
అయితే, అక్కడున్నవారు అతడిని కాపాడే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చెరువు వద్దకు చేరుకున్నారు. గత ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలను కొనసాగించారు. కొంతసేపటికి గత ఈతగాళ్లు చెరువులో నుంచి శ్రీకాంత్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనతో శ్రీకాంత్ కుటుం సభ్యులు తీవ్ర విషాదం నెలకొంది.