నిజామాబాద్ జిల్లాలో దారుణం: ఆటోలో కరోనా రోగి మృతదేహం తరలింపు

తెలంగాణలోని నిజామాబాదులో దారుణం చోటు చేసుకుంది. కరోనా వైరస్ తో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని వైద్య సిబ్బంది ఆటోలో తరలించారు. అలా తరలించడం కరోనా మార్గదర్శకాలకు విరుద్ధం.

Dead body of corona patient was shifted in auto in Nizmabad district

నిజామాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ తో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తరలించడంలో గందరగోళం చోటు చేసుకుంది. మృతదేహం తరలింపులో నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 

మృతదేహాన్ని ఆటోలో తరలించారు. అలా తరలించడం కరోనా వైరస్ మార్గదర్శకాలకు విరుద్ధం. కోరనా రోగి మృతదేహాన్ని అంబులెన్స్ లో ఎస్కార్టు వాహనంతో తరలించాల్సి ఉంటుంది. పైగా, మృతదేహాన్ని తరలించిన ఆటో  డ్రైవర్ కు గానీ, అతని పక్కన కూర్చున వ్యక్తికి గానీ పీపీఈ కిట్లు లేవు.

Also read: నిజామాబాద్‌లో ప్రభుత్వాసుపత్రిలో కలకలం: ఒకే రోజు కరోనాతో నలుగురు మృతి

అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని ఆటోలో తరలించాల్సి వచ్చిందని అంటున్నారు. ఆస్పత్రిలో ముగ్గురు కరోనా వైరస్ రోగులు మరణించారని, దాంతో అంబులెన్స్ అందుబాటులో లేదని చెబుతున్నారు. 

నిజామాబాద్ జిల్లాలో ఒకేసారి నలుగురు మరణించారు. వీరిలో ముగ్గురు కరోనా వైరస్ వ్యాధితో మరణించారు. దాంతో మృతుల బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ స్థితిలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం ఆస్పత్రిని సందర్శించారు. గత రెండు నెలల కాలంలో నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పది మంది మరణించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios