ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణం: సనత్‌నగర్ బాలుడి హత్యపై డీసీపీ


హైద్రాబాద్ సనత్ నగర్ లో  ఎనిమిదేళ్ల  బాలుడు  వహీద్ హత్యకు  ఆర్ధిక లావాదేవీలే  కారణమని  పోలీసులు ప్రకటించారు.  

DCP Srinivas Rao Clarifies On Eight Year Old Waheed Murder Case In Hyderabad Sanath nagar lns

హైదరాబాద్: నగరంలోని  సనత్ నగర్ లో  ఎనిమిదేళ్ల బాలుడు  వహీద్  హత్యకు ఆర్ధిక వివాదాలే కారణమని  పోలీసులు ప్రకటించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించినట్టుగా  నరబలి కాదని  డీసీపీ  శ్రీనివాసరావు  ప్రకటించారు. 

శుక్రవారం నాడు  డీసీపీ  శ్రీనివాసరావు  మీడియాతో మాట్లాడారు.  సనత్ నగర్ లో ఎనిమిదేళ్ల  బాలుడు  వహీద్ హత్య  ఘటనకు గల కారణాలను డీసీపీ  వివరించారు.  వహీద్  హత్యకు  ఆర్ధిక లావాదేవీలే  కారణమని  డీసీపీ  శ్రీనివాసరావు  చెప్పారు.  మృతుడి కుటుంబ సభ్యులు  చెప్పినట్టుగా  నరబలి కాదన్నారు.  చీటీ డబ్బుల విషయంలో  వీరి మధ్య  ఘర్షణ  జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

also read:హైద్రాబాద్‌లో దారుణం: అమావాస్య నాడు ఎనిమిదేళ్ల బాలుడి నరబలి

నిన్న సాయంత్రం  ఇమ్రాన్  అనే ట్రాన్స్ జెండర్  ఇంట్లో  వహీద్   హత్యకు గురయ్యాడని  పోలీసులు తెలిపారు.  ఆడుకొనేందుకు వహీద్ వెళ్లిన సమయంలో  ఇమ్రాన్ వహీద్ ను  హత్య చేసి  డెడ్ బాడీని  బకెట్ లో  కుక్కినట్టుగా  పోలీసులు తెలిపారు. ఈ మృతదేహన్ని  గోనెసంచిలో  మూటకట్టి   నాలాలో  పడేశారని పోలీసులు తెలిపారు.  ఈ  ఘటనకు సంబంధించి   ఐదుగురిని  అదుపులోకి తీసుకొని  ప్రశ్నిస్తున్నట్టుగా  పోలీసులు తెలిపారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios