Asianet News TeluguAsianet News Telugu

వీడిన డెత్ మిస్టరీ.. అప్సరను హతమార్చింది పూజారే..సీన్ టు సీన్ వివరించిన డీసీపీ

Apsara Death Case: తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతున్న అప్సర డెత్ మిస్టరీ వీడింది. అప్సర తనను పెళ్లి చేసుకోవాలని వేధించడంతోనే హత్య చేసినట్లు నిందితుడు వెంకట సాయికృష్ణ ఒప్పుకున్నాడు. ఈ కేసు గురించి శంషాబాద్‌ డీసీపీ నారాయణ రెడ్డి సంచలన విషయాలను వెల్లడించారు. 

DCP revealed sensational details about Apsara murder KRJ
Author
First Published Jun 9, 2023, 11:44 PM IST

Apsara Death Case: హైదరాబాద్ శంషాబాద్‌ పరిధిలో జరిగిన అప్సర అనే యువతి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది.  ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను శంషాబాద్‌ డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు సీన్ టూ సీన్ వివరించారు. నిందితుడు వెంకట సాయి కృష్ణను పెళ్లి చేసుకోవాలని అప్సర వేధించడంతో హత్య చేసినట్లు తెలిపారు. హత్య అనంతరం ఏమీ తెలియనట్టు యువతి కనిపించడం లేదంటూ నిందితుడే శంషాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు .. అసలు హంతకుడు వెంకట సాయి కృష్ణనే అని తేల్చారు. ప్రస్తుతం హంతకుడిన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. హంతకుడు వెంకట సాయి కృష్ణది అంబేడ్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం నరేంద్ర పురం గ్రామం. కాగా.. హైదరాబాద్ లో సిర్థపడ్డారు. అతనికి 2010 లో పెళ్లి అయ్యింది. ఇద్దరూ పిల్లలు కూడా. అతడు  ప్రస్తుతం సరూర్ నగర్ బంగారు మైసమ్మ పూజారిగా విధులు నిర్వహిస్తూ.. మరోవైపు బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా కూడా పని చేస్తున్నాడు. ఇక అప్సరది తమిళనాడు. సినిమాల్లో నటించాలనే కోరికతో ఆమె డిగ్రీ పూర్తి కాగానే సినీ ప్రయత్నాలను ప్రారంభించింది.

ఈ క్రమంలో 2022 ఏప్రిల్‌లో హైదరాబాద్ వచ్చింది. అప్సర తండ్రి కాశీ ఆశ్రమంలో నివసిస్తున్నాడు. అప్సర తరుచు సరూర్ నగర్ బంగారు మైసమ్మ ఆలయానికి వచ్చేది. ఈ క్రమంలో పూజారి సాయికృష్ణతో  పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త.. పరిమితులు దాటింది. హద్దులు దాటి శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో అస్సర గర్భం కూడా దాల్చింది. కానీ సాయి.. ఆ గర్భాన్ని తీసేయించాడు. ఈ క్రమంలో (2023 మార్చిలో) తనను పెళ్లి చేసుకోవాలని అప్సర సాయి కృష్ణపై ఒత్తిడి తీసుకవచ్చింది. ఈ సమయంలో సాయి కృష్ణకి పెళ్లి అయిందని తెలిసినప్పటికీ.. తనని కూడా పెళ్లి చేసుకోవాలని అప్సర బలవంతం చేసింది. అప్సర ప్రవర్తనతో విసిగు చెందిన సాయికృష్ణ ఆమెను  చంపాలి అని నిర్ణయించుకున్నారు.  

పథకం ప్రకారం ఈ నెల 3న ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. 4న మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌ పడేశాడు. ఆ మరుసటి 5న మ్యాన్‌హోల్‌లో మట్టి వేశాడు. అయితే.. రాత్రి వరకు దర్వాసన ఎక్కువ రావడంతో మళ్లీ కొంత మట్టి పోశాడు. మరోవైపు.. తన బిడ్డ కనిపించడం లేదని అప్సర తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించింది. అప్సర కోసం పోలీసులతోపాటు హంతకుడు సాయి కూడా అన్నిచోట్ల వెతికాడు.

పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్‌ ట్రాక్‌ రికార్డును పరిశీలించారు. సాయి, అప్సర సెల్ ఫోన్ల సిగ్నల్ ఒకే చోట ఉండడంతో పూజరి సాయిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పంతుల్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తనని పెళ్లి చేసుకోవాలని వేధించడంతోనే హత్య చేశానని పూజారి సాయి ఒప్పుకున్నాడు. దీంతో పాటు గత కొన్నాళ్ల నుంచి అప్సరతో వివాహేతర సంబంధం ఉందని ఒప్పుకున్నట్లు తెలిసింది. వివాహం చేసుకోవాలని అప్సర తనని ఒత్తిడి చేసిందని, తమ వివాహేతర సంబంధం బయటపడుతుందని భయంతోనే ఆమె హత్య చేశానని సాయి చెప్పినట్టు  డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.

సీన్‌ టూ సీన్‌

జూన్ 3 వ తేదీ కోయంబత్తూర్ వెళ్లాలనే నెపంతో అప్సరని కారు ఎక్కించుకున్నాడు. ఉదయం 8.15 కి సరూర్ నగర్ నుంచి వారి ప్రయాణం ప్రారంభమైంది. 11 గంటల ప్రాంతంలో శంషాబాద్ సరిహద్దుల్లోకి తీసుకెళ్లారు. అప్పటికే కారు ముందు సీట్‌లో అప్సర పడుకుని ఉంది. మధ్యాహ్నం 3.50 ప్రాంతంలో సుల్తాన్ పూర్ వద్ద ఉన్న గోశాల వైపు తీసుకెళ్లాడు. పడుకున్న అప్సర మొహంపై కారు కవరింగ్ షీట్ సహాయంతో బలంగా నొక్కాడు. దీంతో అప్సర ప్రతిఘటించింది. ఈ క్రమంలో సాయి తనతో పాటు తెచ్చుకున్న రాయితో అప్సర తలపై కొట్టాడు.

ఇలా దాదాపు 10 సార్లు కొట్టడంతో అప్సర అక్కడికక్కడే చనిపోయింది. అప్సరను అదే కారులో తీసుకొని ఇంటికి వచ్చాడు. డెడ్ బాడీని కారులోనే పెట్టి ఒక రోజు మొత్తం ఇంటి ముందే పార్క్ చేశాడు. మరుసటి రోజు ఉదయం డెడ్ బాడీని తీసుకువెళ్లి మ్యాన్‌హోల్ లో పడేశాడు. మ్యాన్‌హోల్‌లో ఉన్న డెడ్ బాడీపై కాస్త మట్టి పోయి..కనిపించకుండా చేశాడు. కానీ.. రాత్రి వరకూ దుర్వాసన ఎక్కువ కావడంతో ఎవరికి అనుమానం రాకుండా ఉదయం సమయంలో మ్యాన్‌హోల్‌లో మట్టిని నింపాడు. ఈ విషయం ఎవరికి తెలియదని భావించాడు. కానీ..పోలీసుల విచారణలో ఎట్టకేలకు పట్టుబడ్డాడు పట్టుబడ్డాడు.

Follow Us:
Download App:
  • android
  • ios