హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. హబ్సిగూడ చౌరస్తాలో వాహనాలపై డీసీఎం దూసుకెళ్లింది.
హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. హబ్సిగూడ చౌరస్తాలో వాహనాలపై డీసీఎం దూసుకెళ్లింది. వివరాలు.. వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం.. అదుపుతప్పి ఇతర వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు, మూడు ఆటోలు, మూడు బైక్‌లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
