తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య

First Published 3, Jul 2018, 6:09 PM IST
daughter suicide when mother reprobate hyderabad
Highlights

హైదరాబాద్ లో విషాదం...

చిన్న చిన్న కారణాలతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న అనేక ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో సంభవిస్తున్నాయి. అలాంటి సంఘటనే తాజాగా హైదరాబాద్ లో చోటుచేసుకుంది. తల్లి మందలించిదన్న కారణంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ దుర్ఘటనక సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఫిలింనగర్ దీన్ దయాళ్ నగర్ కి చెందిన ఆంజనేయులు-మొరమ్మ దంపతులు. వీరికి శిరీష ఏకైక కూతురు. ఆంజనేయులు బంజారాహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో హౌజ్ కీపర్ గా పనిచేస్తున్నాడు. మొరమ్మ గృహిణి.

శిరీష పదో తరగతిలో ఫెయిల్ అవ్వడంతో ఇంట్లోనే ఉంటోంది. దీంతో తల్లి ఆమెకు ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్పేది. వాటిని శిరీష నిర్లక్ష్యం చేస్తుండటంతో తరచూ మందలిస్తుండేది. దీంతో మనస్థాపానికి గురైన శిరీష ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఆత్మహత్య పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
  

loader