Asianet News TeluguAsianet News Telugu

ప్రేమకు అడ్డుగా ఉన్నాడని.. కన్న తండ్రిని మైనర్ కూతురే కడతేర్చింది...

రామకృష్ణ Postmortem నివేదికలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.  మృతుడి గొంతు నులిమినట్లుగా,  బలంగా కొట్టినట్లుగా గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

daughter kills her father along her boy friend hyderabad
Author
Hyderabad, First Published Nov 13, 2021, 9:29 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్ : తమ ప్రేమకు అడ్డు చెబుతున్నాడని ఓ కూతురు ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేసింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జూలైలో జరిగిన ఈ ఘటనపై పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఈ దర్యాప్తులో అసలు కథ బయటపడింది. ఇన్స్పెక్టర్  మన్మోహన్  శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. 

ఈ దర్యాప్తులో పల్సం రామకృష్ణ (49) భార్య, కూతురుతో కాప్రాలో నివాసం ఉంటూ స్థానిక గ్యాస్ ఏజెన్సీ లో ఉద్యోగం చేస్తున్నాడు. గత జూలై 20న తలకు Strong woundsతో రామకృష్ణ స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మరో పెద్ద ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంట్లో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆ మేరకు కేసు నమోదు చేశారు. 

ఆశ్చర్యపరిచిన పోస్టుమార్టం నివేదిక…
అయితే, రామకృష్ణ Postmortem నివేదికలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.  మృతుడి గొంతు నులిమినట్లుగా,  బలంగా కొట్టినట్లుగా గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంట్లో భాగంగా మృతుడి భార్య, family membersను విచారించారు.  దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.  

అమానుషం : సంతానం కోసం.. యువతిని కొనుక్కొచ్చి, 16నెలలు బంధించి అత్యాచారం.. సహకరించిన భార్య...

గతంలో  నారాయణగూడలోని ఓ అపార్ట్మెంట్ లో వీరు ఉండేవారు.  రామకృష్ణ కూతురైన Minor girl అపార్ట్మెంట్ వాచ్మెన్  కొడుకు చెట్టి భూపాల్(20)తో ప్రేమలో పడింది. విషయం తెలిసిన బాలిక తండ్రి పలుమార్లు మందలించాడు.  ఈ క్రమంలో భూపాల్ ఆ బాలికకు మాయమాటలు చెప్పి రామకృష్ణ ఇంట్లో 1.75 లక్షలు చోరీ చేశాడు. ఖరీదైన బైక్, సెల్ ఫోన్, బట్టలు కొనుక్కుని మైనర్ బాలికతో జల్సాలు చేశాడు. దీనిపై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు భూపాల్ ను రిమాండ్ కు తరలించారు.

కూతురి ప్రేమ వ్యవహారం బయటపడుతుందని…
ఆ తర్వాత రామకృష్ణ కాప్రాకు మకాం మార్చాడు. గత జూలైలో జైలు నుంచి విడుదలైన భూపాల్ తిరిగి బాలికతో మాట్లాడడం మొదలు పెట్టాడు. అతడినే marriage చేసుకోవాలని బాలిక కూడా నిర్ణయించుకుంది. దీంతో తమ loveకు అడ్డుగా ఉన్న రామకృష్ణను హత్య చేయాలని భావించారు. భూపాల్ తన ఇద్దరు మిత్రులతో కలిసి రామకృష్ణ murderకు పథకం వేశాడు. తినే ఆహారంలో మత్తు మందు కలిపితే హత్య చేయడం సులువుగా ఉంటుందని ఆలోచించారు.

జూలై 19 సాయంత్రం వీరు Intoxicating marble powderను కూతురుకు అందజేశారు.  తల్లిదండ్రులు తినే ఆహారంలో ఆ పౌడర్ ను ఆమె కలపడంతో వారు నిద్రలోకి వెళ్ళిపోయారు.  భూపాల్ తన మిత్రులతో  రాత్రి ఒంటి గంట సమయంలో  కాప్రాకు చేరుకున్నాడు. నిద్రలో ఉన్న రామకృష్ణ ముఖంపై భూపాల్,  గణేష్  బ్లాంకెట్ వేసి అదిమి పట్టుకోగా, ప్రశాంత్ కత్తితో తలపై  బలంగా పొడిచాడు.  నొప్పితో మేల్కొన్న రామకృష్ణను చూసిన accussed అక్కడి నుంచి పరారయ్యారు.

తేరుకున్న కుటుంబ సభ్యులు రామకృష్ణను hospitalకి తరలించగా మృతిచెందారు. కూతురి ప్రేమ విషయం బయటకు వస్తుందన్న ఆలోచనతో మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు విషయం చెప్పకుండా దాచారు. అయితే, పోస్టుమార్టం నివేదికతో దర్యాప్తు జరిపిన పోలీసులు వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారు. తండ్రి హత్యకు ప్లాన్ చేసిన కూతురు, భూపాల్, గణేష్, ప్రశాంత్ లతో పాటు ప్రశాంత్ ను రక్షించాలని ప్రయత్నం చేసిన అతని తండ్రి కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios