తన కూతురు వివాహానికి రావాలని ఆహ్వానం

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో కలిశారు.

కాటమరాయుడు షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్‌ను కలిసిన దత్తాత్రేయ తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరారు. పవన్‑‑ను ఆహ్వానించేందుకు దత్తాత్రేయ వెంట బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు.