తెలంగాణలో కొందరు ఉద్యోగులు మాత్రమే కేసిఆర్ తొత్తులుగా మారిపోయారని పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. వారే యావత్ తెలంగాణ ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు.  ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం లో ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవితాన్ని, జీతాన్ని ఫణంగా పెట్టి పోరాడారని కొనియాడారు. అలాంటి వారి సమస్యలను కేసిఆర్ సర్కారు నాలుగు సంవత్సరాలు అయినా పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కొంతమంది ఉద్యోగులను ఈ ప్రభుత్వం లొంగదీసుకొని లక్షల మంది జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించారు. ఉద్యోగుల తరుపున ఏ పోరాటికైనా కాంగ్రెస్ సిద్దంగా ఉందని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సర్కారుకు లేఖ రాస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం లో గంటలకొద్ది వారితో చర్చించిన కేసిఆర్ ఇప్పుడు వాళ్ల సమస్యలపై మిమ్మల్ని కలుస్తాం అంటె అయిదు నిమిషాలు కూడా ఏందుకు సమయం ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు ప్రభుత్వ తొత్తులుగా మారి మొత్తం ఉద్యోగుల కు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం లో పులుల్లా కొట్లాడిన ఉద్యోగులు ,ఇప్పడు పిల్లుల లెక్క ఏందుకు అయ్యారని ప్రశ్నించారు. సీపిఏస్ విధానం పై కేంద్రం తో ఈ ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. అయిదు నెలల క్రితమే పీఆర్సి పై కమిటీ వేయాలి...పీఆర్సీ వేయడానికి ఏందుకు వెనకాడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఇక్కడికి రప్పించడంలో విఫలం అయ్యారని విమర్శించారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసారు కాని .ఆ కార్యాలయాలకు సరిపోయే ఉద్యోగులను నియమించలేదన్నారు. 58సంవత్సరాల ఉద్యోగుల రిటైర్మెంట్ ను 60సంవత్సరాల కు పెంచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. కాంట్రాక్టు ఉధ్యోగులను శ్రమదోపిడి చేస్తుందని విమర్శించారు. తెలంగాణ వస్తే అసలు అవుట్ సోర్సింగ్ గే ఉండదంన్న కేసిఆర్ మరి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులందరిని సలహాదారునిగా ఈ ప్రభుత్వం నియమించడం వల్ల సర్విస్ లో ఉన్న ఉద్యోగులు నష్టపోతున్నారని చెప్పారు.

డాక్టర్ శ్రవణ్ ఫుల్ ప్రెస్ మీట్ వీడియో కింద ఉంది చూడండి.