దానం ఎఫెక్ట్: అధిష్టానం పిలుపు, హుటాహుటిన ఢిల్లీకి ఉత్తమ్

Danam effect: Uttam leaves for Delhi
Highlights

మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామాతో కాంగ్రెసు అధిష్టానం ఉలికిపడింది.

హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామాతో కాంగ్రెసు అధిష్టానం ఉలికిపడింది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు.

ఢిల్లీలోని వార్ రూమ్ సమావేశానికి హాజరు కావాలని ఆయనను కాంగ్రెసు అధిష్టానం ఆదేశించింది. కమిటీ ఏర్పాటు, సంస్థాగత మార్పులపై ఉత్తమ్ కుమార్ రెడ్డితో అధిష్టానం పెద్దలు మాట్లాడే అవకాశం ఉంది. 

దానం నాగేందర్ శుక్రవారం కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖలను ఆయన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, టీపీసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారు. 

దానం నాగేందర్ రాజీనామాపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెసు సీనియర్లు శుక్రవారం సాయంత్రం సమావేశమై చర్చించారు. 

loader