Nizamabad Urban: సీనియర్ రాజ‌కీయ నాయ‌కులు డీ శ్రీనివాస్ త‌న మాస్ట‌ర్ ప్లాన్ తో తన పెద్ద కుమారుడు సంజయ్ కి కాంగ్రెస్ నుంచి టిక్కెట్టును కన్ఫామ్ చేసిన‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ లో అగ్ర‌నాయ‌కుడిగా, మంచి గుర్తింపు ఉన్న డీఎస్ వేరే పార్టీలోకి వెళ్ల‌డంతో చాలా మంది కాంగ్రెస్ నేత‌లు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను మ‌ళ్లీ కాంగ్రెస్ లోకి రాకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ తన రాజకీయ అనుభవం ఎంటో చూపిస్తూ కాంగ్రెస్ గూటికి త‌న కుమారుడిని చేర్చారు.  

Congress Politics-Nizamabad Urban: తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప‌లు ప్రాంతాల్లో రాజ‌కీయాలు ర‌సవ‌త్త‌రంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్ర‌ధాన రాజీకీయ పార్టీ మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ కొన‌సాగుతుండ‌గా, ప‌లు పార్టీలు అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇదే నేప‌థ్యంలో సీనియ‌ర్ రాజ‌కీయ నాయకులు డీ. శ్రీనివాస్ కుమారుడు ధ‌ర్మ‌పురి సంజ‌య్ కాంగ్రెస్ పార్టీలోకి చేర‌డంతో నిజామాబాద్ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. అక్క‌డి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను మారుస్తున్నాయి.

సీనియర్ రాజ‌కీయ నాయ‌కులు డీ శ్రీనివాస్ త‌న మాస్ట‌ర్ ప్లాన్ తో తన పెద్ద కుమారుడు సంజయ్ కి కాంగ్రెస్ నుంచి టిక్కెట్టును కన్ఫామ్ చేసిన‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ లో అగ్ర‌నాయ‌కుడిగా, మంచి గుర్తింపు ఉన్న డీఎస్ వేరే పార్టీలోకి వెళ్ల‌డంతో చాలా మంది కాంగ్రెస్ నేత‌లు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను మ‌ళ్లీ కాంగ్రెస్ లోకి రాకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ తన రాజకీయ అనుభవం ఎంటో చూపిస్తూ కాంగ్రెస్ గూటికి త‌న కుమారుడిని చేర్చారు. ఆయ‌న‌కు సీటు సైతం కన్ఫామ్ అయింద‌ని తెలుస్తోంది. దీంతో నిజామాబాద్ అర్బన్‌పై ఆశలు పెట్టుకున్నవారి నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌తో కాంగ్రెస్ పార్టీలో మ‌రో పోరు మొద‌లైంద‌ని స‌మాచారం. అయితే, ఇప్ప‌టికే అంత‌ర్గ‌త పోరుతో న‌లిగిపోతున్న కాంగ్రెస్ కు ఈ అంశం ఇప్పుడు మ‌రో కొత్త స‌మ‌స్య‌ను తీసుకువ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. 

మొత్తంగా గ‌మ‌నిస్తే త‌న మాస్ట‌ర్ మైండ్ ను ఉప‌యోగించి డీ శ్రీనివాస్ తాను అనుకున్న సాధించ‌డంలో ఇప్ప‌టిర‌కు స‌క్సెస్ అయిన‌ట్టు తెలుస్తోంంది. ఎందుకంటే కాంగ్రెస్ లోకి రాకుండా అడ్డుకుంటున్న స‌మ‌యంలో ఆయ‌న త‌న రాజ‌కీయ అనుభ‌వంతో ఆ పార్టీలో చేరారు. అలాగే, త‌న కుమారుడిని సైతం చేర్పించి.. సీటు క‌న్ఫామ్ చేసుకున్నార‌ని టాక్. అయితే, పొలిటిక‌ల్ డ్రామాకు తెర‌లేపుతూ తాను కాదు.. త‌న కుమారుడు కాంగ్రెస్ కు చేరారంటూ.. 24 గంట‌ల్లోనే మ‌ళ్లీ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. సంజయ్ కు టిక్కెట్ కన్ఫార్మ్ అయిన త‌ర్వాతే ఇలాంటి చ‌ర్య‌ల‌కు తెర‌లేపిన‌ట్టు స‌మాచారం.

నిజామాబాద్ అర్బన్‌లో వైశ్య సామాజిక వర్గానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ కు ప్ర‌స్తుతం పార్టీలోను, ప్రజల్లోనూ వ్యతిరేకత పెరుగుతుండ‌టంతో ధ‌ర్మ‌పురి సంజ‌య్ కు క‌లిసివ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఎందుకంటే ఈ నియోజ‌క‌వ‌ర్గంలోమున్నూరు కాపుల బలమెక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఈసారి మున్నూరు కాపు బిడ్డను గెలిపించుకోవాలనే గట్టి పట్టుదలతో ఆ సామాజికవర్గీయులంతా ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ అంశాల‌తో పాటు త‌న తండ్రి రాజకీయ బ‌లంతో కాంగ్రెస్ నాయ‌కుడిగా విజ‌యం సాధించాల‌ని సంజ‌య్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

ఇదిలావుంటే, ఇక్క‌డి సీటుపై ప‌లువురు కాంగ్రెస్ నాయ‌క‌లు ఆశ‌పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాక‌ను మొద‌టినుంచి వ్య‌తిరేకిస్తున్నారు. బాహాటంగానే వారికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేశారు. వారిని అడ్డుకునేందుకు అంతర్గతంగా పావులు కదిపారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితేంటన్న చర్చ సాగుతోంది. ఇప్ప‌టికే సంజయ్‌కు టిక్కెట్ కన్ఫామ్ అయిందనే వార్త‌ల‌ను కొట్టిపారేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో బీజేపీలో ఉన్న త‌న త‌మ్ముడు అర‌వింద్ పై సైతం పోటీ చేయ‌డానికి సిద్ధ‌మంటూ ప్ర‌క‌టించ‌డం స‌రికొత్త పొలిటిక‌ల్ వార్ మొద‌లైంది. దీంతో ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి అరవింద్ పోటీ చేస్తాడన్న ప్రచారంతో సంజయ్‌ను అక్కడే నుంచే పోటీ చేయించాల‌ని ప‌లువురు కాంద‌గ్రెస్ నేత‌లు అధిష్ఠానాన్ని కోరిన‌ట్టు టాక్. అయితే, ఇప్ప‌టికే అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ ఈ ప‌రిస్థితుల‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మ‌రి.. !