Asianet News TeluguAsianet News Telugu

దిశ కేసు: కీలక సాక్ష్యాలు సేకరణ, 27న ఛార్జీషీట్ దాఖలు

దిశ నిందితుల కేసులో  ఈ నెల 27న చార్జీషీట్ దాఖలు చేయనున్నారు పోలీసులు. ఈ కేసులో పోలీసులు కీలకమైన సాక్ష్యాలను సేకరించారు.

Cyberabad police to file Charge sheet on Disha Case on december 27
Author
Hyderabad, First Published Dec 25, 2019, 6:23 PM IST

హైదరాబాద్: దిశ కేసుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు ఈ నెల 27వ తేదీన షాద్‌నగర్‌ కోర్టులో చార్జీషీట్‌ను దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు.

Also read:దిశ నిందితులకు మరో 9 కేసులతో లింకులు: ఆధారాలు సేకరించిన పోలీసులు

గత నెల 27వ తేదీన దిశపై నలుగురు నిందితులు శంషాబాద్ కు సమీపంలోని తొండుపల్లి సర్వీస్ రోడ్డు‌ పక్కనే ఉన్న భవనంలో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేశారు.  నిందితులు ఈ నెల 6వ తేదీన షాద్‌నగర్‌కు సమీపంలోని చటాన్‌పల్లి అండర్ పాస్ వద్ద పోలీసుల ఎన్‌కౌంటర్‌లో  మృతి చెందారు.

Also read:హైకోర్టుకు చేరిన దిశ నిందితుల రీపోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టు

దిశపై గ్యాంగ్‌రేప్, హత్యకు సంబంధించిన కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కీలకమైన సాక్ష్యాలను సేకరించారు. ఈ నెల 27వ తేదీన పోలీసులు షాద్‌నగర్ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయనున్నారు. దిశపై అత్యాచారం జరిగిన సంఘటన స్థలం నుండి ఆమె ధరించిన లోదుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

Also read:కారణమిదే: దిశ నిందితుల మృతదేహాలకు నేడు అంత్యక్రియలు

బాధితురాలు ఉపయోగించిన క్యాట్‌వాక్ చెప్పులు, పర్స్,  ఆధార్ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. పర్సులో ఓ డెబిట్ కార్డుతో పాటు ముగ్గురు క్రెడిట్ కార్డులను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

also read:దిశ నిందితుల మృతదేహాలకు ముగిసిన రీపోస్ట్‌మార్టం: బంధువులకు అప్పగింత

నిందితులు తాగిన మద్యం బాటిల్‌ను కూడ పోలీసులు సీజ్ చేశారు. ఈ మద్యం బాటిల్‌పై నిందితుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. బాధితురాలికి మద్యం కూడ తాగించి అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.

Also Read:రీ పోస్టుమార్టం: దిశ నిందితుల డెడ్‌బాడీలకు నో ఎంబామింగ్

మద్యం తాగేందుకు సోడా, కూల్‌డ్రింక్ సీసాలను కూడ పోలీసులు సేకరించారు. వీటిపై నిందితుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు.అయితే ఈ ఘటన జరిగిన సమయంలో  రోడ్డు పక్కన ఉన్న భవనంలో ప్రహారీగోడ చిన్నగా ఉంది.అయితే ప్రస్తుతం ఈ గోడ ఎత్తు పెంచారు. ఈ గోడపై నుండి దూకి భవనంలోకి వెళ్లకుండా ప్రహారీగోడ నిర్మించారు. భవిష్యత్తులో  ఇలాంటి ఘటనలు జరగకుండా ఈ ప్రహారీగోడను నిర్మించారు.

Also Read:Year Roundup 2019: ఒక దిశ, ఒక హాజీపూర్.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన తెలంగాణ

నిందితులు ఆ రోజున ఇంపీరియల్ బ్లూ మద్యం తాగినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మద్యం బాటిల్‌కు డబ్బాను పోలీసులు సేకరించారు.ఈ నెల 27వ తేదీన పోలీసులు చార్జీషీట్‌ను సమర్పించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios