హైకోర్టుకు చేరిన దిశ నిందితుల రీపోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టు

దిశ నిందితుల మృతదేహాల రీ పోస్టుమార్టం  ప్రాథమిక నివేదిక మంగళవారం నాడు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందింది.

Aiims Forensic team submits disha accused re post postmortem report to telangana high court


హైదరాబాద్: దిశ నిందితుల మృతదేహాల రీ పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టును ఎయిమ్స్ వైద్యులు మంగళవారం నాడు ఉదయం అందించారు. పూర్తి నివేదికను వారం రోజుల్లో  అందిస్తామని వైద్యులు హైకోర్టు రిజిష్ట్రార్‌కు సమాచారం ఇచ్చారు.

Also read:కారణమిదే: దిశ నిందితుల మృతదేహాలకు నేడు అంత్యక్రియలు

దిశ నిందితుల మృతదేహాలకు ఈ నెల 23వ తేదీన ఎయిమ్స్ కు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీపోస్టుమార్టం నిర్వహించింది. రీ పోస్టుమార్టం పూర్తైన తర్వాత నిందితుల మృతదేహాలను కుటుంబ సబ్యులకు అందించారు. నిందితుల మృతదేహాలకు సోమవారం రాత్రి అంత్యక్రియలు జరిగాయి.

also read:దిశ నిందితుల మృతదేహాలకు ముగిసిన రీపోస్ట్‌మార్టం: బంధువులకు అప్పగింత

తెలంగాణకు సంబంధం లేని ఫోరెన్సిక్ నిపుణులతో నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని  తెలంగాణ హైకోర్టు తెలంగాణ  వైద్య,ఆరోగ్యశాఖను ఆదేశించింది. దీంతో ఎయిమ్స్ ‌కు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం రీపోస్టుమార్టం నిర్వహించారు.

Also Read:రీ పోస్టుమార్టం: దిశ నిందితుల డెడ్‌బాడీలకు నో ఎంబామింగ్

రీపోస్టుమార్టంకు చెందిన ప్రాథమిక రిపోర్టును మంగళవారం నాడు ఉదయం తెలంగాణ హైకోర్టు రిజిష్ట్రార్‌కు అందించారు. అంతేకాదు రీ పోస్టుమార్టం చేసే  సమయంలో తీసిన వీడియో సీడీని కూడ ఎయిమ్స్ బృందం హైకోర్టుకు సమర్పించింది.

Also Read:Year Roundup 2019: ఒక దిశ, ఒక హాజీపూర్.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన తెలంగాణ

వారం రోజుల్లో పూర్తిస్తాయి నివేదికను హైకోర్టుకు అందించనున్నట్టు ఎయిమ్స్ బృందం తెలపింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి రీ పోస్టుమార్టం రిపోర్టు కీలకం కానుంది. ఈ రిపోర్ట్‌ ఆధారంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ చేయనుంది.

సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ 2020 జనవరి మాసంలో  హైద్రాబాద్‌ కేంద్రంగా విచారణ చేయనుంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios