హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌస్‌లపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. 32 ఫామ్‌హౌస్‌లలో తనిఖీలు నిర్వహించారు. 

హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌస్‌లపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు.32 ఫామ్‌హౌస్‌లలో తనిఖీలు నిర్వహించారు. వీకెండ్ సమయంలో ఈ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో 4 ఫామ్ హౌస్‌ల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ సోదాలు సందర్భంగా మొత్తం 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడుల్లో భారీగా మద్యం, హుక్కా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రూ. 1.03 లక్షల నగదు, 7 ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అసాంఘిక కార్యకలాపాలు జరుగుతన్నట్టుగా గుర్తించివాటిలో మెయినాబాద్‌లోని బిగ్ బాస్ ఫామ్ హౌస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలీ, శంషాబాద్ పరిధిలోని రిప్లెజ్ ఫామ్‌హౌస్, మేడ్చల్‌లోని గోవర్దన్ రెడ్డి ఫామ్ హౌస్ ఉన్నట్టుగా తెలుస్తోంది.