కాల్ స్పూఫింగ్‌తో టోకరా: 12 మంది సైబర్ మోసగాళ్లను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు


క్రెడిట్ కార్డుల వివరాలు  సేకరించి  ఖాతాదారుల డబ్బులను స్వాహా చేస్తున్న  12 మంది సభ్యుల ముఠాను  సైబరాబాద్ పోలీసులు అరెస్ట్  చేశారు.

Cyberabad Police  Arrested  12  for  Call spoofying lns

హైదరాబాద్: క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాల నుండి పెద్ద మొత్తంలో  డబ్బులను స్వాహా  చేస్తున్న 12 మంది  సభ్యుల ముఠాను  సైబరాబాద్  పోలీసులు అరెస్ట్  చేశారు.

ఎస్‌బీఐ, యాక్సిస్  బ్యాంకుకు చెందిన క్రెడిట్ కార్డుల వివరాలను  సేకరించి బ్యాంకు  ఖాతాల నుండి  డబ్బులను  12 మంది  ముఠా స్వాహా  చేసింది. ఢిల్లీ కేంద్రంగా  ఈ ముఠా కార్యకలాపాలు సాగించింది.  కాల్ స్పూఫింగ్  తో  ఖాతాదారులకు  ఫోన్  చేసి క్రెడిట్ కార్డుల వివరాలను  ఈ ముఠా తెలుసుకుంది. ఈ వివరాల ఆధారంగా  బాధితుల ఖాతాల నుండి  డబ్బులను స్వాహా చేశారు.  దేశ వ్యాప్తంగా  ఈ ముఠాపై  1200 కేసులున్నట్టుగా  పోలీసులు గుర్తించారు.  ఈ ముఠా  ఎందరి నుండి  ఎంత మొత్తంలో డబ్బులు కొల్లగొట్టారనే విషయమై  సైబరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు.  

టెక్నాలజీని అడ్డుపెట్టుకొని  సైబర్ మోసగాళ్లు  రోజుకో రకంగా మోసాలకు  పాల్పడుతున్నారు.సైబర్ మోసాలపై  పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.  అయితే  టెక్నాలజీని  ఉపయోగించుకొని  నిందితులు  సరికొత్త రూపంలో  మోసాలకు  పాల్పడుతున్నారు.

ప్రముఖుల పేరుతో  సోషల్ మీడియా వేదికగా  ఖాతాలను సృష్టించి  డబ్బులు  అడిగిన ఘటనలు  కూడ గతంలో చోటు  చేసుకున్నాయి.  ఫోన్లు లేదా  సోషల్ మీడియా ఖాతాలకు  లింకులు పంపి  డబ్బులు స్వాహా  చేసిన ఘటనలు కూడ నమోదయ్యాయి.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios