Asianet News TeluguAsianet News Telugu

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఇంట తీవ్ర విషాదం 

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. సీపీ స్టీఫెన్ రవీంద్రకు పితృ వియోగం కలిగింది.  సీపీ తండ్రి, మాజీ పోలీస్ అధికారి రంజిత్ బుధవారం రాత్రి కన్నుమూశారు.

Cyberabad Cp Stephen Ravindra Father Ranjith Passes Away KRJ
Author
First Published Oct 26, 2023, 1:14 AM IST

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. స్టీఫెన్ రవీంద్ర  తండ్రి, మాజీ పోలీస్ అధికారి రంజిత్ బుధవారం రాత్రి కన్నుమూశారు. పోలీస్ శాఖలో సీపీ తండ్రి రంజిత్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సేవలందించారు. ఆయనకు పోలీస్ డిపార్ట్ మెంట్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 

డీజీపీ సంతాపం

మాజీ పోలీస్ ఆఫీసర్ రంజిత్ మృతిపట్ల తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతి పోలీస్ వర్గాలకు తీరని లోటని అన్నారు. ఆయన మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రంజిత్ నేతృత్వంలో పోలీస్ అధికారిగా పనిచేసిన అనుభవం ఉందని, పోలీస్ శాఖలో ఆయన సేవలు మరువలేనివని అన్నారు. గుంటూరులో ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు రంజిత్ గారితో తనకు ప్రత్యేక  అనుబంధం ఉందని డీజీపీ అంజనీకుమార్ గుర్తు చేసుకున్నారు.  ఆ దేవుడి వారి కుటుంబానికి ఆత్మస్థైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios