Asianet News TeluguAsianet News Telugu

రూ. 300 కోట్లు కొల్లగొట్టే ప్లాన్: నకిలీ ఎస్ఐ అనిల్‌తో చైనా కేటుగాళ్ల ఒప్పందం

ఆన్‌లైన్ లోన్‌యాప్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాల నుండి డబ్బులను డ్రా చేసుకొనేందుకుగాను చైనా కేటుగాళ్లు అనిల్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొన్నారు.
 

cyber crime police found key information from fake si Anil in loan app case lns
Author
Hyderabad, First Published Jun 18, 2021, 10:24 AM IST

హైదరాబాద్: ఆన్‌లైన్ లోన్‌యాప్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాల నుండి డబ్బులను డ్రా చేసుకొనేందుకుగాను చైనా కేటుగాళ్లు అనిల్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొన్నారు.నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తిన అనిల్ ను పోలీసులు  ఇటీవల అరెస్ట్ చేశారు. అనిల్‌ను  విచారణ చేస్తే కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆన్‌లైన్ యాప్ కేసులో పోలీసులు  ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను నకిలీ ఎస్ఐ అనిల్ డీఫ్రీజ్ చేయించారు. కోల్‌కత్తాలోని ఐసీఐసీఐ బ్యాంకుకు డీఫ్రీజ్ చేయాలని అనిల్ రాసిన లేఖ ఆధారంగా  బ్యాంకు అధికారులు ఈ ఖాతాలోని నిధులను మరో బ్యాంకు ఖాతాలోకి మళ్లించారు.

also read:ఆన్‌లైన్ లోన్ యాప్‌కేసులో పోలీసులకు బురిడీ: నకిలీ ఎస్ఐ అనిల్ అరెస్ట్

ఇదే తరహాలో ఢిల్లీలో‌ని ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని లేఖ రాశారు. ఈ లేఖపై అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులకు పోలీసులకు సమాచారం అందిస్తే ఈ విషయం వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో నకిలీ ఎస్ఐ అనిల్ ను గత వారంలో అరెస్ట్ చేశారు. విచారణలో అనిల్ పలు విషయాలను పోలీసులకు తెలిపారు. 

సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాల నుండి  రూ. 300 కోట్లను రాబట్టుకోవాలని చైనా కేటుగాళ్లు ప్లాన్ చేశారు. ఈ మేరకు అనిల్ తో ఒప్పందం చేసుకొన్నారు.ఈ  ఈ ఒప్పందం ఆధారంగా చైనా కేటుగాళ్లకు డబ్బులు డ్రా చేసి ఇస్తే అనిల్ కు రూ. 25 లక్షలు ఇవ్వనున్నట్టుగా చైనా కేటుగాళ్లు ఒప్పందం చేసుకొన్నారని అనిల్ పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారని సమాచారం.


 

Follow Us:
Download App:
  • android
  • ios