ఆన్‌లైన్ లోన్‌యాప్ కేసులో బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేసి డబ్బులను తన ఖాతాలోకి మళ్లించుకొన్న నకిలీ ఎస్ఐ అనిల్‌ను తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్: ఆన్‌లైన్ లోన్‌యాప్ కేసులో బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేసి డబ్బులను తన ఖాతాలోకి మళ్లించుకొన్న నకిలీ ఎస్ఐ అనిల్‌ను తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ లోన్ యాప్ ల ద్వారా పలువురి నుండి సేకరించిన నగదును దేశంలోని 1100 బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు నిర్వాహకులు తరలించారు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు 1100 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. అయితే ఈ బ్యాంకు ఖాతాలకు లేఖలు రాసి కోటిన్నర నగదును నకిలీ ఎస్ఐ అనిల్ తన ఖాతాలోకి మళ్లించారు.కోల్‌కత్తాలోని ఐసీఐసీఐ బ్యాంకుకు నకిలీ పత్రాలతో అనిల్ కుమార్ లేఖలను అందించారు. ఈ లేఖల ఆధారంగా ఈ బ్యాంకు ఖాతాను డీఫ్రీజ్ చేసి అనిల్ ఖాతాలోకి ఐసీఐసీఐ మళ్లించింది.

also read:హైద్రాబాద్‌ పోలీసులకు ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల బురిడీ: కోటిన్నర నగదు డ్రా

ఇదే తరహలోనే గురుగ్రామ్‌లోని ఐసీఐసీఐ బ్యాంకుకు లేఖ రాశాడు అనిల్. అయితే గురుగ్రామ్ బ్యాంకు అధికారులు హైద్రాబాద్ ఐసీఐసీఐ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానిక బ్యాంకు అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులను ఈ విషయమై సంప్రదించారు. తాము ఎలాంటి లేఖలు అందించలేదని సైబర్ క్రైమ్ పోలీసులు ఐసీఐసీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు

 దీంతో ఈ వ్యవహరంపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ నిర్వహిస్తే నకిలీ ఎస్ఐ అనిల్ వ్యవహరం వెలుగు చూసింది.గుంటూరు జిల్లాకు చెందిన అనిల్ నకిలీ అవతారమెత్తి ఈ డబ్బులను తన ఖాతాలకు మళ్లించుకొన్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. అనిల్ నుండి నకిలీ లెటర్ ప్యాడ్ లు,స్టాంపులు సీజ్ చేశారు.