Asianet News TeluguAsianet News Telugu

వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో... యువతిని వేధిస్తున్న స్నేహితురాళ్లు, రంగంలోకి సైబర్ క్రైమ్

స్నేహితురాళ్లే తన వ్యక్తిగత ఫోటోలు,వీడియోలను చూపించి వేధిస్తున్నారంటూ ఓ యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

cyber crime... friends Tortured Teenage girl in hyderabad akp
Author
Hyderabad, First Published Jul 16, 2021, 11:27 AM IST

హైదరాబాద్: స్నేహితులే కదా అని తన ఫోన్ ను వారికి ఇచ్చిన యువతి ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆమె ఫోన్ నుండి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను తమ ఫోన్లకు పంపించుకున్న ఇద్దరు యువతులు స్నేహితురాలిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ లో నివాసముండే ఓ యువతి తనను స్నేహితురాళ్లు వేధిస్తున్నారంటూ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సన్నిహితంగా వుంటూనే అనుమానం రాకుండా తన ఫోన్ నుండి  వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను ఫార్వర్డ్ చేసుకున్నారని తెలిపారు. వీటిని అడ్డుపెట్టుకుని తాము చెప్పినట్లు చేయాలంటూ వేధిస్తున్నారని బాధితు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. 

read more  హైదరాబాద్ లో ఘోరం... రోడ్డుపై వెళుతున్న మైనర్ బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం

యువతి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువతిని వేధిస్తున్న స్నేహితురాళ్ల కోసం గాలిస్తున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని, వీడియోలు, ఫోటోలను ఎంత సన్నిహితులకైనా ఇవ్వకూడదని... ఈ విషయంలో మహిళలు మరింత జాగ్రత్తగా వుండాలని సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios