Asianet News TeluguAsianet News Telugu

మహిళలపై అభ్యంతరకర పోస్టింగ్‌లు.. ట్రోలర్స్‌పై పోలీసులు సీరియస్.. 8 మంది అరెస్ట్..

రాజకీయ, సినీ ప్రముఖుల ఫొటోల మార్పింగ్‌పై పోలీసులు సీరియస్‌గా స్పందించారు. ముఖ్యంగా మహిళలపై అసభ్యకరమైన, అభ్యంతరకర  పోస్టింగ్‌లు చేస్తూ ట్రోలింగ్‌కు పాల్పడుతున్న 8 మందిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Cyber crime cops caught 8 persons for posting abusive content against women ksm
Author
First Published Mar 29, 2023, 3:42 PM IST

హైదరాబాద్‌: రాజకీయ, సినీ ప్రముఖుల ఫొటోల మార్పింగ్‌పై పోలీసులు సీరియస్‌గా స్పందించారు. ముఖ్యంగా మహిళలపై అసభ్యకరమైన, అభ్యంతరకర  పోస్టింగ్‌లు చేస్తూ ట్రోలింగ్‌కు పాల్పడుతున్న 8 మందిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా మీడియాకు వెల్లడించారు. మహిళలపై అభ్యంతరకర కంటెంట్‌ పోస్టు చేస్తున్నందుకు సంబంధించి ట్రోలింగ్ చానల్స్‌పై 20 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 

ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలపై అభ్యంతరకర పోస్టింగ్‌‌లు చేస్తున్నారని వెల్లడించారు. వీటిపై ప్రత్యేకంగా దృష్టి సాధించామని చెప్పారు. 10 రోజులు వర్క్ చేసి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 8 మందిని  అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. ట్రోలర్స్‌లో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్ల మధ్యవాళ్లేనని చెప్పారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోకుంటే వారిని ప్రోత్సహించినట్టుగా అవుతుందని అన్నారు. ఇటువంటి అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్టు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios