అనూషను ప్రేమించి పెళ్లి చేసుకున్న శివగౌడ్, మరో మహిళతోనూ వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు.
రెండు రోజుల క్రితం..మూడేళ్ల బాలుడిని కన్నతండ్రి ఆటోకేసి కొట్టిన సంగతి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కర్కశ తండ్రి శివగౌడ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
సీఐ నర్సింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అనూషను ప్రేమించి పెళ్లి చేసుకున్న శివగౌడ్, మరో మహిళతోనూ వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. ఇరువురితో తరచూ ఘర్షణ పడేవాడు. ఈనెల 9న రాత్రి సదరు మహిళతో గొడవపడి అనూష ఇంటికి వచ్చాడు.
సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసులు ఆమెతో కలిసి శివ ఇంటికి వచ్చారు. ఆగ్రహించిన శివ ఉన్మాదిగా మారిపోయి తన మూడేళ్ల కొడుకును ఆటోకేసి బాదాడు. బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్, చైల్డ్‌లైన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి బాలుణ్ని శిశువిహార్‌కు తరలించారు. సీఐ నర్సింహారెడ్డి తీరుపై కూడా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం శివగౌడ్‌ను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
