Asianet News TeluguAsianet News Telugu

TSPSC : టీఎస్పీఎస్సీ సభ్యుల్లో ఆంధ్రుడు.. చర్చనీయంగా మారిన రేవంత్ సర్కార్ నిర్ణయం! 

TSPSC: తెలంగాణలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..టీఎస్‌పీఎస్‍సీ ప్రక్షాళన చేసింది.  ఈక్రమంలో బోర్డు సభ్యుల్లో ఆంధ్రకు చెందిన వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం చోటు కల్పించింది. అయితే.. ఏపీకి చెందిన వ్యక్తిని  టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం వెనుక ఎవరి హస్తం ఉందని చర్చ జోరుగా నడుస్తుంది.

Criticism On Tspsc New Board Appointments KRJ
Author
First Published Jan 30, 2024, 2:00 AM IST

TSPSC: తెలంగాణలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..టీఎస్‌పీఎస్‍సీ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం విదితమే. ఈ క్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఛైర్మన్ గా, అలాగే.. అనిత రాజేంద్ర ఐఏఎస్, పాల్వాయి రజిని కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, ఏరపతి రామ్మోహన్ రావులను  సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. టీఎస్పీఎస్సీ సభ్యుల్లో ఆంధ్రకు చెందిన యరబాడి రామ్మోహన్ రావు కి  రేవంత్ సర్కార్ చోటు కల్పించడం చర్చనీయంగా మారింది. 

వాస్తవానికి రామ్మోహన్ రావు.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వ్యక్తి. రాష్ట్ర విభజన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించింది. అయినా ఆయన ఏపీకి వెళ్లకుండా..  తెలంగాణ ఆప్షన్ ఎంచుకున్నారు. కానీ,  అప్పటి కేసీఆర్ సర్కార్.. ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. తెలంగాణలో ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా..  రామ్మోహన్ రావు ఇటీవలే పోస్టింగ్ తీసుకొని టీఎస్‌జెన్‌కోలో ఈడీగా కొనసాగుతున్నారు. వాస్తవానికి ఆయన ఏప్రిల్ లో పదవీ విరమణ కావాల్సింది. ఈ తరుణంలో రామ్మోహన్ రావును టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయనను టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం వెనుక ఎవరి హస్తం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.

నూతన బోర్డుపై విమర్శలు?

గత ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీకి ఛైర్మన్ గా నియమించడంతో కాంగ్రెస్ పార్టీలోనూ విమర్శలు వెలువెత్తున్నాయి. ఈ క్రమంలో ఏపీకి చెందిన వ్యక్తిని టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించడంతో చర్చ జరుగుతుంది. ఏపీకి బదులు తెలంగాణ వారిని సభ్యులుగా నియమిస్తే బాగుంటుందని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నియమించిన సర్వీస్ కమిషన్ నియామకల బోర్డుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.. దీంతో ఆ బోర్డును రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బోర్డును నియమించింది. కానీ బోర్డులోని సభ్యుల నియమకంపై విమర్శలు రావడం కొత్త ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఉద్యోగుల విభజనలో

రామ్మోహన్ రావు కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వ్యక్తి కాగా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించింది. ఉద్యోగుల విభజన సంధర్భంగా తెలంగాణ ఆప్షన్ ఎంచుకున్న 214 మందిలో రామ్మోహన్ రావు ఒకడు. రాష్ట్ర విభజనలో భాగంగా అన్ని సంస్థల ఉద్యోగాలను 58 : 43 నిష్పత్తిలో విభజించారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు విభజన కమిటీ ఉద్యోగుల విభజన పూర్తి చేసింది. కానీ, ఏపీ స్థానికత ఉన్న రామ్మోహన్ రావుకు కేసీఆర్ ప్రభుత్వం ఆయనను తిరస్కరించి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. రామ్మోహన్ రావు ఇటీవలే పోస్టింగ్ తీసుకొని టీఎస్‌జెన్‌కోలో ఈడీగా కొనసాగుతున్నారు. ఏప్రిల్లో పదవీ విరమణ కావాల్సిన ఆయనను టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించడం వెనుక ఎవరి ప్రమేయముందనే  చర్చ జోరుగా సాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios