Asianet News TeluguAsianet News Telugu

స్నేహితుడ‌ని ఆశ్రయమిస్తే.. ఫ్రెండ్ భార్యపైనే కన్నేశాడు.. చివ‌ర‌కు..?

Hyderabad: ఒక వ్య‌క్తి స్నేహం కార‌ణంగా త‌న స్నేహితుడ‌ని ఇంట్లో ఆశ్ర‌య‌మిచ్చాడు. అయితే, అత‌ను మాత్రం త‌న వ‌క్రబుద్దిని చూపించాడు. అత‌ని భార్యతో ఏకాంతంగా ఉండగా, ఆ దృశ్యాలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేయ‌డం ప్రారంభించాడు. మరో ఘటనలో వివాహేతర సంబంధం కారణంగా ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. 
 

Crime News; Harassment of friend's wife in Hyderabad; Youth killed in Guntakallu due to extra-marital affair
Author
First Published Oct 14, 2022, 5:10 AM IST

Hyderabad: ఓ వ్య‌క్తికి స్నేహితుడ‌ని త‌న‌ ఇంట్లో ఆశ్ర‌య‌మిచ్చాడు. అయితే, అత‌ను మాత్రం త‌న వ‌క్రబుద్దిని చూపించాడు. త‌న‌ భార్యతో ఏకాంతంగా ఉండగా, ఆ దృశ్యాలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేయ‌డం ప్రారంభించాడు. బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో షీ టీమ్ అత‌న్ని అరెస్టు చేసింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటుచేసుకుంది. 

మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. హైద‌రాబాద్ కు చెందిన ఒక వ్య‌క్తి త‌న భార్య‌తో క‌లిసి నివాస‌ముంటున్నాడు. అత‌నికి అబ్దుల్ స‌ల్మాన్ అనే స్నేహితుడు ఉన్నాడు. వారి మ‌ధ్య ఉన్న దోస్తాన్ నేప‌థ్యంలో అత‌నికి త‌న ఇంట్లో ఆశ్ర‌యం ఇచ్చాడు. అయితే, అత‌ను మాత్రం త‌న వ‌క్రబుద్దిని చూపించాడు. త‌న‌ భార్యతో ఏకాంతంగా ఉండగా, ఆ దృశ్యాలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేయ‌డం ప్రారంభించాడు. 

త‌న స్నేహితుడు, భార్య ఏకాంతంగా ఉన్న దృశ్యాల‌ను ర‌హ‌స్యంగా చిత్రీక‌రించాడు. ఆ దృశ్యాల‌ను మిత్రుని భార్య‌కు చూపించి.. బెదిరించ‌డం ప్రారంభించాడు. త‌న కోరిక తీర్చాలంటూ వేధించాడు. లేకుంటే, ఆ దృశ్యాల‌ను పోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో షీ టీం బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుంది.

వివాహేత‌ర సంబంధం.. యువ‌కుడి దారుణ హ‌త్య 

ఇటీవ‌లి కాలంలో వివాహేత‌ర సంబంధాల కార‌ణంగా ప‌చ్చ‌నికాపురంలో చిచ్చుపెట్టుకుంటున్నారు. వివాహేత‌ర సంబంధాల కోసం దారుణంగా ప్రాణాలు తీసుకోవ‌డ‌మో.. ఎదుటువారి ప్రాణాలు తీయ‌డ‌మో చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌న భార్య‌తో ఓ యువ‌కుడు ఏకాంతంగా ఉండ‌గా చూసిన భ‌ర్త‌..  వారిపై దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో యువ‌కుడు ప్రాణాలు కోల్పోగా, మ‌హిళ ఆస్ప‌త్రి పాలైంది. ఈ ఘ‌ట‌న ఏపీలోని అనంత‌పురం జిల్లాలో చోటుచేసుకుంది. 

పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడు హత్యకు గురైన ఘ‌ట‌న గుంతకల్లు లో చోటుచేసుకుంది. గుండాలతండాకు చెందిన స్వామి నాయక్, మంగమ్మ దంపతులు గుంతకల్లుకు చైతన్య థియేటర్‌ సమీపంలో నివాస‌ముంటున్నారు. అయితే,  స్వామినాయక్‌ కారు డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, ఇటీవ‌ల స్వామినాయక్‌ చిన్నాన్న కుమారుడు సుంకేనాయక్‌ తరచూ వారి వ‌స్తూ పోతూ ఉండేవాడు. 

ఈ క్ర‌మంలోనే బుధ‌వారం కూడా వారి ఇంటికి వ‌చ్చాడు. వారి ఇద్ద‌రు పిల్ల‌లు స్కూల్ కు వెళ్ల‌డంతో. మంగ‌మ్మ‌-సుంకేనాయ‌క్ ఏకాంతంగా గ‌డుపుతున్నారు. అదే స‌మ‌యంలో అక్క‌డి చేరుకున్న మ‌హిళ భార్త స్వామి నాయ‌క్ అది చూసి కోపోద్రిక్తుడ‌య్యాడు. క‌త్తితో వారిపై దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో సుంకేనాయ‌క్ ప్రాణాలు కోల్పోయాడు. భార్య‌ను కూడా కొట్టాడు. అనంత‌రం క‌సాపురం పోలీసుల‌కు లొంగిపోయాడు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ నర్శింగప్ప, టూటౌన్‌ సీఐ చిన్నగోవిందు పరిశీలించారు. కేసు న‌మోదుచేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

కోల్ కతాలో బాంబు దాడి.. 

భార్యభర్తల మధ్య వివాదం బాంబుల దాడి చేసుకునే స్థాయికి చేరుకున్న ఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది.  వివరాల్లోకెళ్తే.. తన భార్య అంటాలిలోని మోతీజీల్ ప్రాంతంలోని పుట్టింటికి వెళ్లింది. గత కొంత కాలంగా తన అత్తామామలతో కలిసి అక్కడే నివాసముంటోంది. అయితే, దీనికి ప్రధాన కారణం అతని భార్యకు అక్కడి యువకుడితో వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో.. వారిపై తన స్నేహితులతో కలిసి దాడి చేశాడు భర్త. అయితే, వారిని స్థానికులు పట్టుకుని కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఈ దాడిలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios