PVNR Expressway: హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే పీవీ.నర్సింహ్మ రావు (పీవీఎన్‌ఆర్) ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ ఎక్స్‌ప్రెస్ వే మెహదీపట్నం-హైదరాబాద్ విమానాశ్రయాలను కలిపే 11.6 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్.
Hyderabad: మెహదీపట్నం నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టును కలిపే పీవీ నరసింహారావు (పీవీఎన్‌ఆర్) ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. పిల్లర్ నంబర్లు 111, 112, 113లో పగుళ్లు రావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ఫ్లైఓవర్ కూలిన దుర్ఘటనలను గుర్తుచేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ఎక్స్‌ప్రెస్ వే మెహదీపట్నం-హైదరాబాద్ విమానాశ్రయాలను కలిపే 11.6 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ కు సంబంధించిన పలు పిల్లర్లకు పగుళ్లురావడం స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ కూలిన సంఘటనలు జరిగినందున అధికారులు ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
2007లో హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉండగా కూలిన ఫ్లైఓవర్
రాష్ట్రంలో గతంలో ఫ్లైఓవర్ కూలిన ప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 2007లో హైదరాబాద్‌లోని పంజాగుట్టలో పాక్షికంగా నిర్మించిన ఓ ఫ్లైఓవర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఫ్లైఓవర్ ప్రమాదంలో రెండు పెద్ద కాంక్రీట్ భాగాలు వాహనాలపై పడ్డాయి. ఈ ఘటనపై జరిగిన విచారణలో ఫ్లైఓవర్ నిర్మాణం నాసిరకంగా ఉందని తేలింది.
హైదరాబాద్ విమానాశ్రయానికి త్వరగా చేరుకునేందుకు PVNR ఎక్స్‌ప్రెస్ వే !
మెహదీపట్నం నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టును కలిపే పీవీ నరసింహారావు (పీవీఎన్‌ఆర్) ఎక్స్‌ప్రెస్‌వే 11.6 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్. దీనిని అక్టోబర్ 19, 2009న ప్రారంభించారు. అయితే,ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో సైక్లిస్టులు, ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, నాలుగు చక్రాల సెవెన్-సీటర్లు, గూడ్స్ వాహనాల ప్రవేశం నిషేధించబడింది. హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లే వ్యక్తుల ప్రయాణం మరింత సులభతరం చేయడానికి నగరం నుండి శంషాబాద్ వరకు ట్రాఫిక్ సిగ్నల్ రహిత కదలికను అందించాలనే లక్ష్యంతో దీనిని నిర్మించారు.
