Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీ రద్దు లాంఛనమే: రేపు మంత్రి వర్గ సమావేశం

ముందస్తు శాసనసభ ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పూర్తిగా ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుని సమాచారాన్ని టీఆర్ఎస్ ముఖ్యనేతలకు అందజేసినట్లు చెబుతున్నారు. 

KCR may announce on early elections on Sept 2
Author
Hyderabad, First Published Aug 27, 2018, 3:21 PM IST

హైదరాబాద్: ముందస్తు శాసనసభ ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పూర్తిగా ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుని సమాచారాన్ని టీఆర్ఎస్ ముఖ్యనేతలకు అందజేసినట్లు చెబుతున్నారు. 

కేసిఆర్ సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాదు వస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన సోమవారం రాత్రి ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. రేపు మంగళవారం మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి పాలనాపరమైన నిర్ణయాలను తీసుకుంటారని చెబుతున్నారు. 

ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్య కార్యదర్శులకు ఓ సర్క్యులర్ జారీ చేశారు. రేపటి మంత్రి వర్గ సమావేశంలో కీలకమైన కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 

సెప్టెంబర్ 2వ తేదీన జరిగే టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో అసెంబ్లీ రద్దకు సంబంధించిన ప్రకటన చేయాలని కేసిఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ సభ తర్వాత శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఈ సమావేశాల్లో అసెంబ్లీ రద్దకు సంబంధించిన లాంఛనాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో భారీగా ఐఎఎస్, ఐపిఎస్ ల బదలీలు ఉంటాయని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios