Asianet News TeluguAsianet News Telugu

వామపక్షవాదివా.. మరి బీజేపీలో ఎందుకు చేరుతున్నట్లు: ఈటలపై తమ్మినేని వీరభద్రం ఆగ్రహం

మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి అని చెప్పుకునే ఈటల రాజేందర్ బిజెపిలో చేరడం సిగ్గుమాలిన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

cpim telangana secretary tammineni veerabhadram slams etela rajender ksp
Author
hyderabad, First Published Jun 5, 2021, 10:19 PM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి అని చెప్పుకునే ఈటల రాజేందర్ బిజెపిలో చేరడం సిగ్గుమాలిన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్షాలపై నిందలు వేయడం, విమర్శలు చేయడం సరైనది కాదని వీరభద్రం హితవు పలికారు. దేశంలో కరోనాను కట్టడి చేయడంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని.. మతోన్మాదాన్ని పెంచుతూ హింసను ప్రేరేపిస్తోందని ఆయన ఆరోపించారు. అలాంటి పార్టీ లో చేరడానికి ఈటల కు మనసెలా వచ్చిందంటూ దుయ్యబట్టారు. ఈటల రాజేందర్ తన ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలో చేరుతున్నారని వీరభద్రం ఆరోపించారు. 

కాగా, తాను వామపక్ష లౌకివాదినని..కానీ పరిస్థితులు బీజేపీ వైపు తీసుకెళ్లాయని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు మధ్యాహ్నం మీడియాతో చిట్ చాట్ చేశారు. వచ్చే వారంలో న్యూఢిల్లీలో బీజేపీలో చేరుతానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

Also Read:పదే పదే నా పేరెందుకు.. నా భుజాలపై తుపాకీ పెట్టొద్దు, చివరి వరకు కేసీఆర్‌తోనే: ఈటల‌కు హరీశ్ అల్టీమేటం

ఎన్నికల్లో సీపీఐ పోటీలో ఉండాలా వద్దా అనేది ఎవరు నిర్ణయిస్తున్నారని ఆయన అడిగారు. 2018 ఎన్నికల్లోనే తనను ఓడించేందుకు టీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నాలు చేసిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే తనను హుజురాబాద్ లో ఓడించేందుకు రూ. 50 కోట్లు టీఆర్ఎస్ ఖర్చు చేసిందన్నారు. హరీష్ రావు తన కంటే ఎక్కువ అవమానాలకు గురయ్యారని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఇవాళ ఉదయమే ఆయన టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. రేపు ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios