Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌తో సీట్ల సర్ధుబాటుపై చర్చలు: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

కాంగ్రెస్‌తో పొత్తులపై చర్చ జరుగుతుందని సీపీఐ ప్రకటించింది. కాంగ్రెస్ తో సీట్ల సర్ధుబాటుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. 

CPI National General secretary Narayana clarifies on  Congress Alliance lns
Author
First Published Oct 10, 2023, 12:58 PM IST

హైదరాబాద్: కాంగ్రెస్ తో  పొత్తులపై  చర్చ జరుగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు.మంగళవారంనాడు  హైద్రాబాద్ సీపీఐ రాష్ట్ర సమితి కార్యాలయంలో నారాయణ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ తో రాజకీయ అవగాహన కుదిరిందన్నారు. సీట్ల సర్ధుబాటుపై  చర్చిస్తున్నామని నారాయణ తెలిపారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చర్చలు జరుపుతున్నారని నారాయణ చెప్పారు. తమకు, సీపీఎంకు ఐదేసీ అసెంబ్లీ స్థానాలు కోరినట్టుగా నారాయణ తెలిపారు.

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  బీఆర్ఎస్ కు సీపీఐ, సీపీఎంలు మద్దతు ప్రకటించాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడ పొత్తు కొనసాగుతుందని  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు. అయితే  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు.  మొత్తం 115 అసెంబ్లీ స్థానాలకు కేసీఆర్ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడంపై  లెఫ్ట్ పార్టీలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. తమతో చర్చించకుండానే  అభ్యర్థుల జాబితాను ప్రకటించడంపై  కేసీఆర్ పై లెఫ్ట్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే అదే సమయంలో  కాంగ్రెస్ నేతలు  లెఫ్ట్ పార్టీలతో  పొత్తులకు స్నేహ హస్తం అందించారు.

also read:సీపీఐ, సీపీఎంలకు రెండు అసెంబ్లీ సీట్లు: కాంగ్రెస్ నిర్ణయం

లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశంపై చర్చలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అప్పగించింది. లెఫ్ట్ పార్టీలతో భట్టి విక్రమార్క చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే  సీపీఐ, సీపీఎంలకు రెండేసీ  అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సానుకూలంగా ఉందని సమాచారం.ఇవాళ సీపీఐ, సీపీఎంల సంయుక్త సమావేశం జరగనుంది.  కాంగ్రెస్ తో సీట్ల సర్ధుబాటుపై  రెండు పార్టీలు చర్చించనున్నాయి. లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది.  లెఫ్ట్ కోరే  నాలుగైదు సీట్లను ఆ పార్టీలకు కేటాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీలకు ఉన్న ఓటు బ్యాంక్ తమ పార్టీకి కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు ప్రతిపాదన చెడిపోకుండా ఉండేలా ఆ పార్టీ నేతలు జాగ్రత్త పడుతున్నారు.

కాంగ్రెస్ తో  సీట్ల సర్ధుబాటు కుదరకపోతే  సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నిన్న విడుదలైంది.  ఈ ఏడాది నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.డిసెంబర్ 3న  ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios