Asianet News TeluguAsianet News Telugu

నల్గొండ ఐసోలేషన్ వార్డు నుండి కరోనా రోగి పరార్: భయాందోళనలో గ్రామస్తులు

నల్గొండ ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ సెంటర్ నుండి ఓ రోగి తప్పించుకొని పారిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే  వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

covid patient escapes from nalgonda isolation ward
Author
Nalgonda, First Published Jul 13, 2020, 9:38 PM IST

నల్గొండ:  నల్గొండ ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ సెంటర్ నుండి ఓ రోగి తప్పించుకొని పారిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే  వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

నల్గొండ ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ సెంటర్ లో కరోనా సోకిన మహిళను చేర్పించారు. అయితే ఆమె సోమవారం నాడు ఆసుపత్రి ఐసోలేషన్ వార్డు నుండి తప్పించుకొని పారిపోయింది.

also read:తెలంగాణలో కరోనా టెస్టులను పది రెట్లు పెంచాలి: కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు

మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలో కరోనా సోకిన బాధితురాలు ప్రత్యక్షమైంది. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తుల్లో టెన్షన్ నెలకొంది. కరోనా సోకిన రోగి స్వంత గ్రామానికి చేరుకొందని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కరోనా రోగిని నల్గొండ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 

ఐసోలేషన్ వార్డు నుండి ఆమె ఎందుకు తప్పించుకుపోయిందో తెలియరాలేదు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నాటికి కరోనా కేసులు 34,671కి చేరుకొన్నాయి. ఆదివారం నాడు కొత్తగా 1269 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాజ్ భవన్ లో 10 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. గవర్నర్ తమిళిసై కి మాత్రం నెగిటివ్ వచ్చింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios