టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ : కోర్టులో ట్రయల్స్ ప్రారంభం.. హాజరైన 37 మంది నిందితులు
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో కోర్టులో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఈ విచారణకు 37 మంది నిందితులు హాజరయ్యారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డ, రేణుక, రాజేశ్వర్‌తో పాటు మిగిలిన నిందితులు హాజరయ్యారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో కోర్టులో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఈ విచారణకు 37 మంది నిందితులు హాజరయ్యారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డ, రేణుక, రాజేశ్వర్‌తో పాటు మిగిలిన నిందితులు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి గత నెలలో ప్రాథమిక చార్జ్‌షీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు. ప్రాథమిక ఛార్జ్‌షీట్‌లో 37 మందిని నిందితులుగా చేర్చారు. ఈ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో ఇప్పటి వరకు 105 మందిని సిట్ అరెస్ట్ చేసింది. త్వరలో మిగతా నిందితులతో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు సిట్ అధికారులు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ మినహా మిగిలిన అందరికీ ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది కోర్ట్.