Asianet News TeluguAsianet News Telugu

రామాయంపేట తల్లీ కొడుకుల సూసైడ్ .. నిందితులకు బెయిల్ మంజూరు

కామారెడ్డి తల్లి, కొడుకు ఆత్మహత్య కేసులో నిందితులకు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. మొత్తం ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. దీంతో వీరంతా జైలు నుంచి విడుదల కానున్నారు. 

court sanctioned bail for ramayampet mother and son suicide case accused
Author
Ramayampet, First Published May 13, 2022, 8:02 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కామారెడ్డి తల్లి, కొడుకు ఆత్మహత్య కేసులో నిందితులకు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. మొత్తం ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 

కాగా.. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన Padma, Santoshలు కామారెడ్డిలోని లాడ్జీలో ఆత్మహత్య చేసుకొన్నారు. ఆత్మహత్య చేసుకొనే ముందు వారిద్దరూ కూడా సెల్ఫీ వీడియో రికార్డు చేశారు.. తమ ఆత్మహత్యకు ఏడుగురు కారణమని కూడా వారు పేర్కొన్నారు. దీంతో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రామాయం పేట్ మున్సిపల్ చైర్మెన్ జితేందర్, మార్కెట్ చైర్మెన్ యాదగిరి తో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగార్జున గౌడ్ మాత్రం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు ప్రకటించారు.  అయితే నాగార్జున గౌడ్ ను ఈ కేసు నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని  బాధిత కుటుంబ సభ్యులు అప్పట్లోనే అనుమానాలు వ్యక్తం చేశారు. సీఐ నాగార్జున గౌడ్ విధులకు హాజరౌతున్నా కూడా అతడు పరారీలో ఉన్నట్టు చూపడంపై బాధిత కుటుంబం ప్రశ్నిస్తుంది. సీఐను కాపాడే ప్రయత్నం చేసేందుకు ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. సిఐ నాగార్జున గౌడ్ నిజంగా పరారీలోనే ఉన్నారా లేక పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చూపిస్తున్నారా తేల్చాలని కూడా బాధిత కుటుంబం ప్రశ్నిస్తుంది.  

Also Read;రామాయంపేట తల్లీ కొడుకుల సూసైడ్: విధుల్లో ప్రత్యక్షమైన సీఐ నాగార్జున గౌడ్

ఏప్రిల్ 11వ తేదీన Kamareddyకి వచ్చిన తల్లీ కొడుకులు లాడ్జీలో రూమ్ అద్దెకు తీసుకొన్నారు. అక్కడే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నారు. వైద్యం చేయించుకొనేందుకు కామారెడ్డికి వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే వీరితో పాటు పద్మ భర్త కూడా కామారెడ్డికి వచ్చాడు. అతనికి ఆసుపత్రిలో చికిత్స చేయించిన తర్వాత  అతడిని రామాయంపేటకు పంపారు. కామారెడ్డిలోని లాడ్జీలోనే ఉండి ఓ దేవాలయంలో దర్శనం చేసుకొని వస్తామని  కుటుంబ సభ్యులకు చెప్పారు.  కానీ కామారెడ్డి లాడ్జీలోనే వారు ఆత్మహత్య చేసుకొన్నారు.

లాడ్జీలోని వీరు బస చేసిన రూమ్ నుండి మంటలు రావడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే తలుపులు పగులగొట్టి చూడడంతో అప్పటికే వీరిద్దరూ కూడా సజీవ దహనమయ్యారు.  ఆత్మహత్య చేసుకొనే ముందు సోషల్ మీడియాలో కూడా సంతోష్ తమ ఆత్మహత్యకు ఏడుగురి పేర్లను చెప్పారు.ఈ  వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios