రామాయంపేట తల్లీ కొడుకుల సూసైడ్: విధుల్లో ప్రత్యక్షమైన సీఐ నాగార్జున గౌడ్


ఉమ్మడి మెదక్ జిల్లాలోని రామాయంపేట తల్లీ కొడుకుల ఆత్మహత్య కేసులో తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్ విధుల్లో ప్రత్యక్షమయ్యాడు. ఈ కేసులో రిమాండ్ రిపోర్టులో నాగార్జునగౌడ్ పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చూపించారు.

CI Nagarjuna Goud Attends Duty In Thungathurthi

మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోనిRamayampet తల్లీ కొడుకు ఆత్మహత్య కేసులో ఉన్న Thungathurthi సీఐ నాగార్జున గౌడ్ విధుల్లో ప్రత్యక్షమయ్యారు. కామారెడ్డిలోని లాడ్జీలో రామాయంపేటకు చెందిన తల్లీ కొడుకులు  ఈ ఏడాది ఏప్రిల్  11న ఆత్మహత్య చేసుకున్నారు.

 రామాయంపేటకు చెందిన Padma, Santoshలు  కామారెడ్డిలోని లాడ్జీలో ఆత్మహత్య చేసుకొన్నారు. ఆత్మహత్య చేసుకొనే ముందు వారిద్దరూ కూడా సెల్ఫీ వీడియో రికార్డు చేశారు.. తమ ఆత్మహత్యకు ఏడుగురు కారణమని కూడా వారు పేర్కొన్నారు. దీంతో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మున్సిపల్ చైర్మెన్ జితేందర్, మార్కెట్ చైర్మెన్ యాదగిరి తో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగార్జున గౌడ్ మాత్రం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు ప్రకటించారు.  అయితే నాగార్జున గౌడ్ ను ఈ కేసు నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని  బాధిత కుటుంబ సభ్యులు అప్పట్లోనే అనుమానాలు వ్యక్తం చేశారు. సీఐ నాగార్జున గౌడ్ విధులకు హాజరౌతున్నా కూడా అతడు పరారీలో ఉన్నట్టు చూపడంపై బాధిత కుటుంబం ప్రశ్నిస్తుంది. సీఐను కాపాడే ప్రయత్నం చేసేందుకు ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు.

ఈ కేసు నుండి సీఐ Nagarjuna Goud  ను తప్పించేందుకు కొందరు రాజకీయ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. ఈ కేసులో సీఐను అరెస్ట్ చేయకపోవడం ఇందుకు కారణమని కూడా బాధిత కుటుంబం ఆరోపణలు చేస్తున్నారు. సిఐ నాగార్జున గౌడ్ నిజంగా పరారీలోనే ఉన్నారా లేక పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చూపిస్తున్నారా తేల్చాలని కూడా బాధిత కుటుంబం ప్రశ్నిస్తుంది.  రామాయంపేట ఆత్మహత్యల ఘటన రాస్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన నేతలపై  ఆత్మహత్య చేసుకొన్న ఇద్దరు  ఆరోపణలు చేశారు.

ఏప్రిల్ 11వ తేదీన Kamareddyకి వచ్చిన తల్లీ కొడుకులు లాడ్జీలో రూమ్ అద్దెకు తీసుకొన్నారు. అక్కడే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నారు. వైద్యం చేయించుకొనేందుకు కామారెడ్డికి వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే వీరితో పాటు పద్మ భర్త కూడా కామారెడ్డికి వచ్చాడు. అతనికి ఆసుపత్రిలో చికిత్స చేయించిన తర్వాత  అతడిని రామాయంపేటకు పంపారు. కామారెడ్డిలోని లాడ్జీలోనే ఉండి ఓ దేవాలయంలో దర్శనం చేసుకొని వస్తామని  కుటుంబ సభ్యులకు చెప్పారు.  కానీ కామారెడ్డి లాడ్జీలోనే వారు ఆత్మహత్య చేసుకొన్నారు.

లాడ్జీలోని వీరు బస చేసిన రూమ్ నుండి మంటలు రావడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే తలుపులు పగులగొట్టి చూడడంతో అప్పటికే వీరిద్దరూ కూడా సజీవ దహనమయ్యారు.  ఆత్మహత్య చేసుకొనే ముందు సోషల్ మీడియాలో కూడా సంతోష్ తమ ఆత్మహత్యకు ఏడుగురి పేర్లను చెప్పారు.ఈ  వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

రామాయంపేట సీఐగా పనిచేసిన నాగార్జున గౌడ్‌తో పాటు మరో ఆరుగురు మా ఆత్మహత్యకు కారణంగా మృతులు వీడియోలో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ ఏడుగురు వ్యక్తుల ద్వారా ఆస్తులు కోల్పోయామని సంతోష్ పేర్కొన్నారు.  అధికార పార్టీ వాళ్లు కావడం వల్లే నాకు న్యాయం జరగడం లేదు. మా చావుతోనైనా మాకు న్యాయం చేయండని  సంతోష్ వీడియోలో తెలిపాడు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios