Asianet News TeluguAsianet News Telugu

మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ సహా ఐదుగురు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

లంచం కేసులో అరెస్టైన మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ సహా ఐదుగురు నిందితులను కస్టడీకి కోర్టు బుధవారం నాడు అనుమతిచ్చింది.

Court permits Medak additional collector four others to custody from sep 21 to sep 24
Author
Hyderabad, First Published Sep 16, 2020, 5:00 PM IST

హైదరాబాద్: లంచం కేసులో అరెస్టైన మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ సహా ఐదుగురు నిందితులను కస్టడీకి కోర్టు బుధవారం నాడు అనుమతిచ్చింది.

 మెదక్ జిల్లాలోని చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ‌ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేశాడు అడిషనల్ కలెక్టర్ నగేష్. ఈ విషయంలో రూ. 40 లక్షలు లంచం తీసుకొంటూ నగేష్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 

ఈ కేసులో ఏసీబీ అధికారుల విచారణలో మరో ముగ్గురు రెవిన్యూ అధికారులు సహా నగేష్ బినామీ పాత్రను గుర్తించారు. సుమారు 12 గంటల విచారణ తర్వాత ఈ నెల 9వ తేదీన అడిషనల్ కలెక్టర్ నగేష్ సహా ముగ్గురు రెవిన్యూ అధికారులు, నగేష్ బినామీ జీవన్ గౌడ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఇంకా సమగ్ర దర్యాప్తు చేసేందుకుగాను కస్టడీని కోరుతూ కోర్టులో ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ నెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఐదుగురు నిందితులను కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీన ఉదయం జైలు నుండి నిందితులను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొంటారు. 

ఏసీబీ కేసులో చిక్కుకొన్న మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ సహా మరో ముగ్గురు రెవిన్యూ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు సస్పెండ్ చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios