ఢిల్లీ లిక్కర్ స్కాం: అరుణ్ రామచంద్రపిళ్లైకి ఏప్రిల్ 3 వరకు జ్యూడీషీయల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈడీ కస్టడీ ముగియడంతో  అరుణ్ రామచంద్రపిళ్లైని  అధికారులు  ఇవాళ  ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.  

Court  Orders  To  Judicial Custody  To  Arun Ramachandra Pillai Till April 3 lns

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కస్టడీ ముగియడంతో  ఈడీ అధికారులు  అరుణ్ రామచంద్రపిళ్లైని  సోమవారంనాడు   మధ్యాహ్నం  రౌస్ అవెన్యూ కోర్టులో   హాజరుపర్చారు.   ఈ ఏడాది ఏప్రిల్  మూడో తేదీ వరకు  అరుణ్ రామచంద్రపిళ్లైకి  జ్యూడీషీయల్ రిమాండ్  ను   విధిస్తూ  రౌస్ అవెన్యూ కోర్టు  ఆదేశాలు  జారీ  చేసింది.  

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత  సోమవారం నాడు  ఈడీ విచారణకు  హాజరయ్యారు. అరుణ్ రామచంద్ర పిళ్లైతో  కలిపి  కల్వకుంట్ల కవితను  ఈడీ అధికారులు  విచారణ  చేసినట్టుగా సమాచారం. కవితను  అరుణ్ రామచంద్రపిళ్లైతో  కలిపి విచారించాల్సి ఉందని  ఈ నెల  16న  కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. అరుణ్ రామచంద్రపిళ్లై  కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు  కోర్టును  కోరారు.  ఇతరులతో  కలిపి విచారణ  విషయమై  కోర్టు  ఈడీ తరపు న్యాయవాదులను  ప్రశ్నించారు.  ఆరోపణలు  ఎదుర్కొంటున్న వారిని నేరుగా  ప్రశ్నించవచ్చు కదా అని కోర్టు  ప్రశ్నించింది. అయితే  ఈ కేసుకు సంబంధించి కీలక  అంశాలను వెలుగులోకి తీసుకురావడం  కోసం  కొందరిని  కలిపి విచారణ  చేయాల్సిన అవసరం ఉందని  కోర్టుకు  ఈడీ అధికారులు  తెలిపారు. దీంతో  అరుణ్ రామచంద్రపిళ్లైకి ఈడీ కస్టడీని  పొడించింది కోర్టు. ఇవాళ్టితో  అరుణ్ రామచంద్రపిళ్లై  ఈడీ కస్టడీ  ముగియనుంది. 

ఇవాళ మధ్యాహ్న భోజనం  వరకు  అరుణ్ రామచంద్రపిళ్లైతో  కలిపి  కవిత ను ఈడీ అధికారులు విచారించారు. మధ్యాహ్న భోజనం తర్వాత  అరుణ్ రామచంద్రపిళ్లైని  ఈడీ అధికారులు  ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు.   అరుణ్ రామచంద్రపిళ్లైకి  జ్యూడీషీయల్ రిమాండ్ ను  ఏప్రిల్  3వ తేదీ వరకు  పొడిగిస్తూ  కోర్టు   ఇవాళ ఆదేశాలు  జారీ  చేసింది.  

also read:ఢిల్లీ లిక్కర్ స్కామ్.. రెండోసారి ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత.. పిళ్లైతో కన్​ఫ్రంటేషన్ చేస్తారా..?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈ నెల  6వ తేదీన  అరుణ్ రామచంద్రపిళ్లైని ఈడీ అధికారులు  అరెస్ట్  చేశారు. ఈ కేసులో  ఈడీ అధికారులకు  అరుణ్ రామచంద్రపిళ్లై కీలక  వాంగ్మూలం ఇచ్చారు.  ఈ స్కాంలో  తాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  ప్రతినిధిగా  వ్యవహరించినట్టుగా  అరుణ్ రామచంద్రపిళ్లై వాంగ్మూలం  ఇచ్చాడు. అయితే  ఈ వాంగ్మూలాన్ని  ఆ తర్వాత  వెనక్కి తీసుకుంటున్నట్టుగా  అరుణ్ రామచంద్రపిళ్లై కోర్టులో పిటిషన్ దాఖలు  చేసిన విషయం తెలిసిందే. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios