Asianet News TeluguAsianet News Telugu

రామచంద్రాపురంలో సూట్‌కేసులో లావణ్య డెడ్‌బాడీ కేసు: ప్రియుడికి జీవిత ఖైదు

సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో  లావణ్య అనే యువతిని హత్య చేసిన ప్రియుడు  సునీల్ కుమార్ కు జీవిత ఖైదు విధించింది కోర్టు.

Court Orders Life Sentence To Sunil in Lavanya Murder Case in Sangareddy District lns
Author
First Published Jul 31, 2023, 7:18 PM IST

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని   రామచంద్రాపురంలో లావణ్య అనే యువతిని హత్యచేసి సూట్ కేసులో  పెట్టి  కాలువలో  వేసిన  ప్రియుడికి  కోర్టు  జీవిత ఖైదును విధించింది.బీహార్ రాష్ట్రానికి చెందిన  మనోజ్ షా కుటుంబం  చాలా ఏళ్ల క్రితం హైద్రాబాద్  కు వలస వచ్చింది.నగరంలోని సూరారం కాలనీలో నివాసం ఉంటుంది.  మనోజ్ షా కొడుకు సునీల్ మేడ్చల్ జిల్లాలోని   ఇంజనీరింగ్ చదువుకున్నాడు.

సమయంలో  సంగారెడ్డి  జిల్లాకు  చెందిన శ్రీనివాసరావు కూతురు లావణ్యతో  సునీల్ కు  పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారితీసింది.  వీరిద్దరి చదువులు పూర్తయ్యాయి. అయినా కూడ వీరిమధ్య బంధం ఆగిపోలేదు.  పెళ్లి చేసుకుంటానని సునీల్ లావణ్యను లోబర్చుకున్నాడు. అయితే పెళ్లి చేసుకోవాలని  లావణ్య ఒత్తిడి పెంచడంతో  ఆమెను  పథకం ప్రకారం చంపాడు సునీల్ కుమార్.

2019  ఏప్రిల్ 4వ తేదీన  ఉద్యోగం కోసం మస్కట్ కు  వెళ్తున్నట్టుగా  లావణ్యను ఆమె తల్లిదండ్రులను  నమ్మించాడు సునీల్ కుమార్.   శంషాబాద్ ఎయిర్ పోర్టులో  తాము వెళ్లాల్సిన  ఫ్లైట్  మిస్ అయిందని  సునీల్ కుమార్  లావణ్యను నమ్మించాడు.  అదే రోజు రాత్రి శంషాబాద్ లాడ్జీలో గడిపారు.  అయితే  పెళ్లి విషయమై  లావణ్య  సునీల్ ను  నిలదీసింది.  దీంతో  సునీల్ ఆమెను హత్య చేశాడు.  

లావణ్య తీసుకువచ్చిన  ట్రావెల్ బ్యాగులోనే  ఆమె డెడ్ బాడీని పెట్టాడు.   సూరారం వచ్చే దారిలోని నాలాలో సూట్ కేసును పారేశాడు.  అయితే  మస్కట్ నుండి  ఇంటికి వస్తున్నట్టుగా  లావణ్య  ఫోన్ నుండి  మేసేజ్ పెట్టాడు.  అయినా ఆమె రాలేదు. దీంతో  పేరేంట్స్ పోలీసులను ఆశ్రయించారు.   ఈ ఫోన్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా  పోలీసులు విచారణ నిర్వహిస్తే లావణ్య హత్య విషయం వెలుగు చూసింది.  సునీల్ కుమార్ లావణ్యను హత్యచేసినట్టుగా పోలీసులు గుర్తించారు.నాలా నుండి లావణ్య డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి  ఇవాళ  కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ప్రియుడు  సునీల్ కుమార్ కు  జీవిత ఖైదును విధించింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios