విషాదం... ఆరువేల కోసం భార్య భర్తల ఆత్మహత్య..
అక్టోబర్ 27న ఇంట్లో ఉంచిన రూ. 6000 కనిపించడంలేదని భార్యాభర్తలు ఘర్షణపడ్డారు. మర్నాడూ ఇదే విషయమై పోట్లాడుకున్నారు. మనస్తాపం చెందిన పోశవ్వ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అదేరోజు సాయంత్రం సాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు.
కామారెడ్డి : ఇంట్లో దాచిన సొమ్ము కనిపించడం లేదని గొడవ పడిన భార్య భర్తలు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ మధుసూదన్ కథనం ప్రకారం.. కోదండం సాయిలు (45), పోశవ్వ (42) భార్యాభర్తలు. కూలి పనులు చేసుకుని బతుకుతుంటారు.
సాయిలుకు ఆమె మూడో భార్య. వీరికి సంతానం లేదు. మొదటి ఇద్దరు భార్యలు అనారోగ్యంతో మృతి చెందారు. అక్టోబర్ 27న ఇంట్లో ఉంచిన రూ. 6000 కనిపించడంలేదని భార్యాభర్తలు ఘర్షణపడ్డారు. మర్నాడూ ఇదే విషయమై పోట్లాడుకున్నారు. మనస్తాపం చెందిన పోశవ్వ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అదేరోజు సాయంత్రం సాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు.
ఆదివారం ఉదయం గోసంగి కాలనీ సమీపంలోని చర్చి వెనకాల.. రెండు dead bodys ఉన్నట్లు సమాచారం అందడంతో బంధువులు వెళ్లి చూశారు. సాయిలు మృతదేహం సగం కాలిపోయి ఉండగా, సమీపంలోని నీటి కుంటలు పోశవ్వ మృతదేహాన్ని గుర్తించారు. సాయిలు నిప్పంటించుకుని చనిపోయాడని పోశవ్వ కుంటలో కి దూకి suicide చేసుకుందని సిఐ తెలిపారు
హైదరాబాద్ లో మరో దారుణం...
Extramarital Affair నెపంతో వివాహిత ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటు చేసుకొంది. ఈ హత్యలో వివాహితతో పాటు ఆమె ప్రియుడు మరో ముగుర్గు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ మీడియాకు వివరించారు.
రాజేంద్రనగర్, శివరాంపల్లికి చెందిన షేక్ ఆదిల్ అలియాస్ Naresh(35) స్థానికంగా పాల వ్యాపారం చేస్తున్నాడు. నరేష్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య జోయాబేగం సైదాబాద్ మోయిన్‌బాగ్‌లో ఉంటోంది.అదే ప్రాంతంలో ఉండే సయ్యద్ ఫరీద్ అలీ అలియాస్ సోహైల్(27)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఈ విషయం తెలిసి భర్త షేక్ ఆదిల్ ఆమెను తరచూ వేధించేవాడు. ఈ విషయాన్ని జోయా బేగం ప్రియుడు ఫరీద్ అలీకి చెప్పింది. దీంతో అతడి అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ పథకం వేశారు. ఫరీద్ అలీ తన స్నేహితులు ముహమ్మద్ రియాజ్, షేక్ మావియా, మహ్మద్ జహీర్‌లతో కలిసి ఈ నెల 19 న రాత్రి జోయాబేగం ఇంటికి చేరుకున్నారు.
తెలంగాణలో ఇద్దరు పురుషులకు పెళ్లి.. తల్లిదండ్రుల నుంచీ గ్రీన్ సిగ్నల్.. వివరాలివే
జోయాబేగంతో పాటు మిగతా నలుగురూ కలిసి ఇంట్లో నిద్రలో ఉన్న షేక్ ఆదిల్ అలియాస్ నరేష్ మెడకు చున్నీతో ఉరి బిగించారు. ఆ కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం షేక్ ఆదిల్ మృతదేహాన్ని ఆటో ట్రాలీలో పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి రోడ్డుకు తరలించారు.
అక్కడ మృదేహంపై petrol పోసి తగులబెట్టారు. murderకు ఉపయోగించిన ఆధారాలను కూడా నిందితులు కాల్చివేశారు. కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు హతుడు షేక్ ఆదిల్‌గా గుర్తించారు. నిందితులు ఉపయోగించిన ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు , మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
దర్యాప్తులో వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యే ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు తేల్చేరు. హత్యలో పాల్గొన్న ఐదుగురినీ అరెస్టు శనివారం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో వనస్ధలిపుం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, అర్జునయ్య, శ్రీదర్‌రెడ్డి, సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.