డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు ఈ హైదరాబాదీ అమ్మాయి షాక్ ఇచ్చింది. మద్యం మత్తులో తూలుతున్న సదరు అమ్మాయి ఎలాగైనా పోలీసులకు దొరకరాదని ప్రయత్నించి తీరా పోలీసుల కళ్లు కప్పి పారిపోయింది. ఆ కేసు వివరాలు చదవండి. అమ్మాయి తాగి జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వద్ద చేసిన హడావిడి కింద వీడియోలో చూడండి.

హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడల్లా పోలీసులకు సరికొత్త అనుభవాలు కలుగుతున్నాయి. గత వారం డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా ఇద్దరు హిజ్రాలు అటు పోలీసులను, ఇటు మీడియా వాళ్లను బండబూతులు తిట్టారు. దీంతో మధ్యలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ వదిలేసి పోలీసులు, మీడియా వాళ్లు వెళ్లిపోయారు.

ఈ శుక్రవారం సాయంత్రం జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక జంట పట్టబడింది. ఆ జంట ఇద్దరూ మద్యం తాగి దొరికిపోయారు. కానీ రోడ్ల మీద పోలీసులకు దొరకకుండా పరుగులు తీశారు. పోలీసులను, మీడియాను పరుగులు పెట్టించారు.  తీరా.. అదుపులోకి తీసుకుందామనుకునేలోగా ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వేరే వాహనంలో ఆ జంట పరారైంది.