సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోల్కూర్‌లో మంత్రాలు చేస్తున్నారనే నెపంతో దంపతులు గ్రామమంతా ఏకమై చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ విషయం ఎవరికైనా చెబితే గ్రామం నుంచి వెలివేస్తామని దంపతులను వూరి పెద్దలు హెచ్చరించారు. 

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది . సదాశివపేట మండలం కోల్కూర్‌లో మంత్రాలు చేస్తున్నారనే నెపంతో దంపతులు గ్రామమంతా ఏకమై చెట్టుకు కట్టేసి చితకబాదారు. గ్రామానికి చెందని యాదయ్య, శ్యామల దంపతులు చేతబడి చేస్తున్నారంటూ ఓ మంత్రగాడు చెప్పాడు. దీంతో అతని మాటలను నిజమని నమ్మిన గ్రామస్తులు వారిద్దరిని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. అంతేకాదు.. ఈ విషయం ఎవరికైనా చెబితే గ్రామం నుంచి వెలివేస్తామని దంపతులను వూరి పెద్దలు హెచ్చరించారు. అయితే వీరి బారి నుంచి ఒక వ్యక్తి తప్పించుకుని విషయం పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred