షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ పేరిట దంపతులు భారీ మోసానికి తెరదీశారు. కౌశిక్ బెనర్జీ అతని భార్య రేఖ దేశవ్యాప్తంగా రూ.34 కోట్లు వసూలు చేశారు. మొత్తం 850 మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో కౌశిక్ దంపతులు వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు  గుర్తించారు. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై వాసులకు వీరు టోకరా వేశారు.

పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు నిర్వహించిన వీరు రూ.34 కోట్లను కొట్టేశారు. రంగంలోకి దిగిన సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సైనిక్‌పురిలో నివసిస్తున్న కౌశిక్, రేఖలను అదుపులోకి తీసుకున్నారు.