Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ చెప్పినా వినని సోమారపు: కాంగ్రెస్‌కు షాక్

 రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ  తన పంతం నెగ్గించుకొన్నారు.  రామగుండం మేయర్ లక్ష్మీనారాయణపై  గురువారం నాడు అవిశ్వాసం పెట్టారు. మేయర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాసానికి అనుకూలంగా 38 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. 

Corporators move NO trust vote on Ramagundam Mayor Laxminarayana

రామగుండం: రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ  తన పంతం నెగ్గించుకొన్నారు.  రామగుండం మేయర్ లక్ష్మీనారాయణపై  గురువారం నాడు అవిశ్వాసం పెట్టారు. మేయర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాసానికి అనుకూలంగా 38 మంది కార్పోరేటర్లు  ఓటు వేశారు. దీంతో లక్ష్మీనారాయణ మేయర్ పదవి నుండి వైదొలిగారు. లక్ష్మీనారాయణను గద్దె దించేందుకు టీఆర్ఎస్‌తో కాంగ్రెస్  పార్టీ కి చెందిన కార్పోరేటర్లు  కలిశారు. పార్టీ జారీ చేసిన విప్‌ను కూడ ధిక్కరించి లక్ష్మీనారాయణకు  వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ  కార్పోరేటర్లు ఓటు చేశారు.

రామగుండం  మేయర్ లక్ష్మీనారాయణపై  అవిశ్వాసం విషయంలో గత మాసంలో  టీఆర్ఎస్  ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ప్రకటించారు. స్వంత పార్టీకి చెందిన మేయర్‌ లక్ష్మీనారాయణపై అవిశ్వాసానికి ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గత మాసంలో రంగం సిద్దం చేశారు. దీంతో ఈ విషయమై పార్టీ నాయకత్వం సోమారపు సత్యనారాయణను మందలించింది.

దీంతో రాజకీయాలకు గుడ్‌బై చెబుతాననని సోమారపు సత్యనారాయణ ప్రకటించారు.  కానీ ఈ విషయమై కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు ఆ సమయంలో సోమారపు సత్యనారాయణను  మంత్రి కేటీఆర్‌ వద్దకు తీసుకొచ్చారు.  

రామగుండంలో నెలకొన్న పరిస్థితులపై  సోమారపు సత్యనారాయణతో చర్చించారు.  ఆ తర్వాత రాజకీయాలకు గుడ్‌బై నిర్ణయాన్ని ఆయన విరమించుకొంటున్నట్టుగా ఆయన ప్రకటించారు.

అయితే మేయర్ అవిశ్వాసం  విషయంలో  సోమారపు సత్యనారాయణ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఇవాళ మేయర్ లక్ష్మీనారాయణపై అవిశ్వాసానికి సంబంధించి రామగుండం కార్పోరేషన్ ప్రత్యేకంగా సమావేశమైంది.

ఈ సమావేశంలో  మేయర్ లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా 28 మంది టీఆర్ఎస్ కార్పోరేటర్లు ఓటు చేశారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది కార్పోరేటర్లు కూడ  పార్టీ విప్‌ను ధిక్కరించి మేయర్ లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఓటు చేశారు.  

లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఓటు చేయకూడదని కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన విప్‌ను కూడ కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది కార్పోరేటర్లు ధిక్కరించారు.  మేయర్ లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా 38 మంది కార్పోరేటర్లు ఓటు చేశారు. 

మేయర్ లక్ష్మీనారాయణపై  అవిశ్వాసం ప్రతిపాదించేందుకు ఎమ్మెల్యే చొరవ తీసుకోవడంపై గత మాసంలో టీఆర్ఎస్ నాయకత్వం  సోమారపు సత్యనారాయణపై  అసంతృప్తిని వ్యక్తం చేసింది.

అయితే  ఆ సమయంలో  అవిశ్వాసం విషయంలో వెనక్కు తగ్గినట్టు కన్పించినా కానీ, ఇవాళ జరిగిన సమావేశంలో మేయర్ పదవి నుండి దింపడంలో కీలక పాత్ర పోషించారని సోమారపు వర్గీయులు చెబుతున్నారు. 

అవిశ్వాసానికి మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, డిప్యూటీ మేయర్ శంకర్‌తో పాటు ఆరుగురు మేయర్ వర్గం కార్పొరేటర్లు, ముగ్గురు కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్‌ గైర్హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి ఓటు వేసిన కాంగ్రెస్ కార్పోరేటర్లపై  ఆ పార్టీ ఏం చర్యలు తీసుకొంటుందోననేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios