రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో టీకాల చోరీ కలకలం రేపింది. జాంబాగ్‌లోని యూపీహెచ్‌లో ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు వ్యాక్సిన్‌లను దొంగిలించారు. 17 కొవాగ్జిన్ వయల్స్, 27 కొవిషీల్డ్ వయల్స్‌ను చోరీ చేశారు. ఈ వయల్స్‌తో మొత్తం 610 మందికి లేదా 610 డోసులు వేయగలిగి ఉండేవారు. ఈ ఘటనపై మీర్ చౌక్ పోలీసులకు హాస్పిటల్ సిబ్బంది ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: కరోనా కేసులు(Corona Cases) ముమ్మరంగా నమోదవుతున్నాయి. దేశంలో థర్డ్ వేవ్(Third Wave) నియంత్రణకు కరోనా టీకాల పంపిణీ కూడా వేగంగా జరుగుతున్నది. మన దేశంలో టీకా పంపిణీ ప్రారంభమైన తొలి నాళ్లలో వ్యాక్సిన్‌లపై అనేక సంశయాలు, అపనమ్మకాలు కొనసాగాయి. కానీ, క్రమంగా అవగాహన పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు టీకా వేసుకోవడంపై వెనుకంజ వేస్తున్నవారు చాలా తక్కువగా ఉన్నారు. అంతేకాదు, హైదరాబాద్‌లో టీకాల చోరీ ఘటన చోటుచేసుకుంది. వ్యాక్సిన్‌లను దొంగిలించడం ఇప్పుడు కలకలం రేపుతున్నది.
జాంబాగ్ యూపీహెచ్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి జాంబాగ్‌లోని యూపీహెచ్(UPH)లోకి చొరబడి వ్యాక్సిన్(Vaccines)లను దొంగిలించారు(Robbed). 17 కొవాగ్జిన్ వయల్స్, 27 కొవిషీల్డ్ వయల్స్‌ను చోరీ చేశారు. అంతేకాదు, వీటితోపాటు ఓ మూడు కంప్యూటర్లనూ ఎత్తుకెళ్లి పోయారు. దొంగతనానికి గురైన వయల్స్‌తో 340 కొవిషీల్డ్ డోసులు, 270 కొవాగ్జిన్ డోసులు ఇచ్చే అవకాశం ఉన్నది. ఈ ఘటన ఆస్పత్రి సిబ్బందిని విస్మయానికి గురి చేసింది. ఎట్టకేలకు తేరుకుని మీర్ చౌక్ పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేశారు.
దేశవ్యాప్తంగా కొవిడ్-19 (Covid-19) కేసులు(Corona Cases) పెరుగుతున్నాయి. అందుకు తెలంగాణ(Telangana) ఏమీ మినహాయింపు కాదు. సోమవారం 70,679 శాంపిల్స్‌ను టెస్టు చేయగా 1,825 మందికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. కరోనా కారణంగా ఒకరు మరణించినట్టు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 4,043కి చేరింది. కాగా, గడిచిన 24 గంటల్లో 351 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.
సోమవారం కీలక నేతలకు కరోనా సోకినట్టు తెలిసింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు కరోనా బారిన పడ్డట్టు సోమవారం తేలింది. ఇదే రోజు బిహార్ సీఎం నితీష్ కుమార్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైల కరోనా టెస్టు ఫలితాలూ పాజిటివ్‌గానే వచ్చాయి.
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,79,723 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ను విడుదల చేసింది. తాజాగా కరోనాతో 146 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,936కి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 46,569 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,45,00,172కి చేరింది. ఇక, ప్రస్తుతం దేశంలో 7,23,619 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఒమిక్రాన్ కేసులు.. మహారాష్ట్రలో 1,216, రాజస్తాన్‌లో 529, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, కేరళలో 333, గుజరాత్‌లో 236, తమిళనాడులో 185, హర్యానాలో 123, తెలంగాణలో 123, ఉత్తరప్రదేశ్‌లో 113, ఒడిశాలో 74, ఆంధ్రప్రదేశ్‌లో 28, పంజాబ్‌లో 27, పశ్చిమ బెంగాల్‌లో 27, గోవాలో 19, మధ్యప్రదేశ్‌లో 10, అస్సోంలో 9, ఉత్తరాఖండ్‌లో 8, మేఘలయాలో 4, అండమాన్ నికోబార్‌లో 3, చంఢీఘర్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో 3, పుదుచ్చేరిలో 1, చత్తీస్‌గఢ్‌లో 1, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లఢఖ్‌లో 1, మణిపూర్‌లో 1 కేసులు నమోదయ్యాయి.
