తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 97 వేల మార్కును దాటింది. తాజాగా 1724 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. పది మంది మరణించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 1724 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,424కు చేరుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 729కి చేరుకుంది. గత 24 గంటల్లో 23841 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 75,186 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసులు 21,509 ఉన్నాయి. 

జిల్లాలవారీగా గత 24 గంటల్లో తెలంగాణలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య

ఆదిలాబాద్ 17
భద్రాద్రి కొత్తగూడెం 27
జిహెచ్ఎంసీ 395
జగిత్యాల 35
జనగామ 13
జయశంకర్ భూపాలపల్లి 7
జోగులాంబ గద్వాల 37
కామారెడ్డి 32
కరీంనగర్ 101
ఖమ్మం 42
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 7
మహబూబ్ నగర్ 32
మహబూబాబాద్ 28
మంచిర్యాల 45
మెదక్ 34
మేడ్చెల్ మల్కాజిగిరి 105
ములుగు 11
నాగర్ కర్నూలు 22
నల్లగొండ 67
నారాయణపేట 9
నిర్మల్ 23
నిజామాబాద్ 61
పెద్దపల్లి 43
రాజన్న సిరిసిల్ల 37
రంగారెడ్డి 169
సంగారెడ్డి 45
సిద్ధిపేట 61
సూర్యాపేట 44
వికారాబాద్ 14
వనపర్తి 28
వరంగల్ రూరల్ 32
వరంగల్ అర్బన్ 91
యాదాద్రి భువనగిరి 10
మొత్తం కేసులు 1724

Scroll to load tweet…